AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: 5G కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. రిలయన్స్ జియో 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది..! ధర ఎంతో తెలుసా..

5G సేవల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందించింది రిలయన్స్‌ జియో. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా సహ ప్రధాన నగరాల్లో ఈ దీపావళి నుంచి 5G సర్వీసులు అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ప్రకటించింది. మరీ 5జీ ఫోన్‌ ధరఎంత..? 

Reliance Jio: 5G కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. రిలయన్స్ జియో 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది..! ధర ఎంతో తెలుసా..
Reliance Jio launched 5G Smartphone
Sanjay Kasula
| Edited By: Basha Shek|

Updated on: Sep 28, 2022 | 7:33 AM

Share

భారత్‌లో కోట్లాది మంది 2జీ, 3జీ వినియోగదారులను 4జీలోకి తీసుకురావడమే లక్ష్యంగా రిలయన్స్‌..జియోఫోన్‌ నెక్ట్స్‌ స్మార్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండేలా దాని ధరను 4,499గా నిర్ణయించింది. అయితే ఇటీవల జరిగిన రిలయన్స్‌ వార్షిక సమావేశంలో 5జీ ఫోన్‌ను కూడా తీసుకొస్తామని జియో ప్రకటించింది. దాంతో 5జీ ఫోన్‌ ధరపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గూగుల్‌తో కలిసి తయారు చేయనున్న ఈ జియోఫోన్‌ నెక్ట్స్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర 8వేల నుంచి 12వేల మధ్య ఉండే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ అంచనా వేసింది. ఫోన్‌లో ఉపయోగిస్తున్న పరికరాల విలువ ఆధారంగా ధరను లెక్కగట్టింది.

ప్రస్తుతం 4జీలో ఉన్న వినియోగదారులను 5జీకి మార్చడమే లక్ష్యంగా జియో దీన్ని తీసుకురానున్నట్లు తెలిపింది. వచ్చే నెల అంటే దీపావళి నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. 5జీ నెట్‌వర్క్‌ కొంత విస్తరించిన తర్వాత రిలయన్స్‌ తమ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది. దీంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ పరికరాల కోసం క్వాల్‌కామ్‌, శామ్‌సంగ్‌, సింటియంట్‌ సహా కొరియా, చైనాకు చెందిన కంపెనీలతో జియో భాగస్వామ్యం కుదుర్చుకొంది.

ఇక 2023-2024 నాటికి జియో 5జీ వినియోగదారుల సంఖ్య 1.2 కోట్లకు, 2024-25 నాటికి 2.1 కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ స్పార్క్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. 4జీ ధరలతో పోలిస్తే 5జీ సేవల ధరలు 20 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అటు 5జీ సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

ఇంకా, ఇది Qualcomm Snapdragon 480 చిప్‌సెట్‌తో పాటు 4GB RAM మరియు 32 GB స్టోరేజ్‌తో అందించబడుతుంది. గూగుల్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ రన్ అవుతుందని భావిస్తున్నారు.

దాని కెమెరా గురించి మాట్లాడుతూ.. లీక్‌ల ప్రకారం, Jio 5G స్మార్ట్‌ఫోన్ 13MP + 2MP వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీని ముందు ప్యానెల్ 8-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి 5,000 mAh బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం