5G Services: టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 9 పట్టణాల్లో 5జీ సేవలు.
అత్యంత వేగంగా 5జీ సేవలను విస్తరిస్తోంది టెలికం సంస్థ జియో. టెలికం రంగంలో సంచనలంలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది యూజర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా 5జీ సేవల విస్తరణపై దృష్టి సారించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో జియో సేవలను విస్తరిస్తూ వస్తోన్న..

అత్యంత వేగంగా 5జీ సేవలను విస్తరిస్తోంది టెలికం సంస్థ జియో. టెలికం రంగంలో సంచనలంలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది యూజర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా 5జీ సేవల విస్తరణపై దృష్టి సారించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో జియో సేవలను విస్తరిస్తూ వస్తోన్న జియో. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మరో 9 పట్టణాల్లో సేవలను విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, చీరాల, భీమవరం, గుంతకల్, నంద్యాల్, తెనాలిలో 5జీ సేవలను ప్రారంభించింది. ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రామగుండం పట్టణాల్లో కొత్తగా 5జీ సేవలను లాంచ్ చేశారు. మంగళవారం నుంచి ఈ పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
అంతకు ముందు ఏపీలో.. జియో తిరుమల, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, కడప, నర్సారావుపేట్, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ పట్టణాల్లో జియో సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. జియో తాజాగా లాంచ్ చేసిన సేవలతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 22 పట్టణాల్లో తెలంగాణలో 9 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 34 పట్టణాల్లో మంగళవారం జియో 5జీ సేవలను ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకు దేశం మొత్తం 225 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.
ఇదిలా ఉంటే 5జీ సేవలను అత్యధిక పట్టణాల్లో అందిస్తోన్న పట్టణంగా జియో నిలిచింది. కొత్తగా 5జీ సేవలు పొందుతోన్న జియో యూజర్లకు జియో వెల్‌కమ్ ఆఫర్‌ను అందిస్తోంది .ఇందులో భాగంగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన రోజు ఉచితంగా 1 జీబీపీస్ స్పీడ్‌తో 5జీ ఇంటర్‌నెట్‌ను అందిస్తోంది. ఇక 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన కేవలం 120 రోజుల్లో 225 పట్టణాల్లో సేవలు ప్రారంభించడం గర్వకారణంగా ఉందని జియో ప్రతినిధి తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని పట్టణాలకు సేవలకు విస్తరిస్తామని తెలిపారు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..
