Good News: తెలుగు రాష్ట్రాలకు జియో సంక్రాంతి కానుక.. మరిన్ని ప్రాంతాలకు 5జీ సేవల విస్తరణ

|

Jan 17, 2023 | 5:20 PM

పట్టణాలకు 5జీ సేవలను అందించాలని టెలికాం సంస్థలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రిలయన్స్ జీయో తగ్గేదేలే అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుక అందించింది.

Good News: తెలుగు రాష్ట్రాలకు జియో సంక్రాంతి కానుక.. మరిన్ని ప్రాంతాలకు 5జీ సేవల విస్తరణ
Jio 5g Services
Follow us on

పట్టణాలకు 5జీ సేవలను అందించాలని టెలికాం సంస్థలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రిలయన్స్ జీయో తగ్గేదేలే అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుక అందించింది. ఇప్పటికే పలు పట్టణాల్లో 5జీ ట్రూ సేవలను తీసుకువచ్చిన రిలయన్స్ జియో.. తాజాగా మరిన్ని పట్టణాలకు విస్తరించింది. దేశంలోని మరో 16 నగరాల్లో తన ట్రూ 5G సేవలను ప్రారంభించినట్లు మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కర్నూలు, తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో Jio True 5G సేవలు నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు వివరించింది. తమ కస్టమర్లకు సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జీయో వివరించింది. తాజాగా.. 16 నగరాల్లో అమల్లోకి వచ్చిన 5జీ సేవలతో.. మొత్తం 134 నగరాల్లోని జియో వినియోగదారులకు 5G సేవలు చేరువయ్యాయని పేర్కొంది.

తెలంగాణలో ఐదు నగరాల్లో

తాజాగా పలు నగరాల్లో ప్రారంభమైన సేవలతో తెలంగాణలో మొత్తం 5 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో జీయో 5జీ సేవలు అందుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9 నగరాల్లో

ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. తిరుమల, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, కాకినాడ నగరాల్లో సేవలు ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మున్ముందు మరిన్ని పట్టణాలకు జీయో 5జీ సేవలను విస్తరిస్తామని జీయో ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..