Diwali Bonanza: లక్ష్మీదేవి కరుణించడం అంటే ఇదేనేమో.. దీపావళికి కొన్ని నిమిషాల్లోనే రూ.67 కోట్ల లాభం!
Diwali Bonanza: రేఖ ఝున్‌ఝున్‌వాలా.. ఈ పేరు వినే ఉంటారు. ఆమెకు దీపావళి కలిసొచ్చింది. లక్ష్మీదేవి కరుణించింది. కొన్ని నిమిషాల్లోనే కోట్లాది రూపాయల లాభం వచ్చింది. లక్ష్మీదేవి కరునించడం అంటే ఇదేనేమో. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. దేశంలోని ప్రముఖ..

Diwali Bonanza: దేశంలోని ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్లలో ఒకరైన రేఖ ఝున్‌ఝున్‌వాలాకు ఈ దీపావళి మొదటి రోజున అద్భుతమైన యోగం లభించింది. ఈరోజు రేఖ ఫెడరల్ బ్యాంక్ షేర్ల నుండి రూ.67 కోట్ల లాభం పొందింది. అది కూడా కొన్ని నిమిషాల్లోనే ఆమె సంపద పెరిగింది. రేఖ ఝున్‌ఝున్‌వాలా ఫెడరల్ బ్యాంక్‌లో 2.42% వాటాలను కలిగి ఉంది. ఆమె ఫెడరల్ బ్యాంక్‌లో దాదాపు 5.90 కోట్ల షేర్లను కలిగి ఉంది. ఈ షేర్ ధర పెరుగుదల కారణంగా రేఖ ఝున్‌ఝున్‌వాలా సంపద విలువ కూడా పెరిగింది. ఫెడరల్ బ్యాంక్‌లో రేఖ వాటా రూ. 67 కోట్లు పెరిగింది. రేఖ ఇటీవల మరణించిన పెట్టుబడిదారు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య. ఆమె తన భర్త పెట్టుబడులను కొనసాగిస్తోంది.
ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ రైలు.. విమానం లాంటి సదుపాయాలు.. కళ్లు చెదిరే డిజైన్
ఫెడరల్ బ్యాంక్ మొత్తం ఈక్విటీ సంపద లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 53,976 కోట్లకు పెరిగింది. సోమవారం అత్యధికంగా ట్రేడ్ అయిన స్టాక్‌లలో ఫెడరల్ బ్యాంక్ ఒకటి. ఈ బ్యాంక్ 5.22 లక్షల షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ అయ్యాయి.
ఫెడరల్ బ్యాంక్ షేర్లకు ఎందుకు అంత డిమాండ్ ఉంది?
ఈసారి రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్ 2025) ఫెడరల్ బ్యాంక్ మంచి ఫలితాలను ఇచ్చింది. దీని ఆదాయం, లాభం పెరిగింది. అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ వ్యాపారం జరిగింది. భవిష్యత్తుపై అంచనాలు కూడా పెరిగాయి. పెట్టుబడిదారులలో మరింత నమ్మకం పెరగడానికి ఇదే కారణం కావచ్చు.

ఇది కూడా చదవండి: Banks Merger: ఈ 4 బ్యాంకులు ఇక ఉండవేమో..? లక్షలాది మంది కస్టమర్ల డిపాజిట్లు ఏమవుతాయి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








