AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ రైలు.. విమానం లాంటి సదుపాయాలు.. కళ్లు చెదిరే డిజైన్

Vande Bharat Sleeper Train: ఈ రైలును BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) తయారు చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) డిజైన్, సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. కైనెట్ రైల్వే సొల్యూషన్స్‌కు ఇలాంటి 120 రైళ్లను నిర్మించే కాంట్రాక్టు లభించింది..

Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ రైలు.. విమానం లాంటి సదుపాయాలు.. కళ్లు చెదిరే డిజైన్
Subhash Goud
|

Updated on: Oct 21, 2025 | 3:12 PM

Share

Vande Bharat Sleeper Train: భారత రైల్వేలు త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్‌ను ప్రారంభించనున్నాయి. ఇప్పటివరకు చైర్ కార్‌గా మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రైలు ఇప్పుడు సుదూర రాత్రిపూట ప్రయాణాలకు మరింత సౌకర్యవంతంగా మారుతుంది. వందేభారత్‌ ప్రారంభించినప్పటి నుండి దాని వేగానికి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు, దాని స్లీపర్ వెర్షన్ ప్రయాణీకులకు లగ్జరీ, సాంకేతికత పరిపూర్ణ సమ్మేళనాన్ని తెస్తుంది.

వందే భారత్ స్లీపర్ రైలు కోసం మొదటి AC కోచ్ నమూనాను ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన (IREE) 2025లో ఆవిష్కరించారు. కైనెట్ రైల్వే సొల్యూషన్స్ అనే ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్ ద్వారా రూపొందించబడిన ఈ మోడల్ ఆధునిక, ఆకర్షణీయమైన, ప్రయాణీకులకు అనుకూలమైన రూపాన్ని కలిగి ఉంది. ప్రజా కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు, RDSO (రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) ద్వారా విస్తృతమైన ట్రయల్ రన్‌లు నిర్వహిస్తారు. అన్ని భద్రత, పనితీరు పారామితులను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే దీనికి ఆమోదం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: SIM Cards: సిమ్‌ కార్డులు వాడే వారికి అలర్ట్‌.. ఈ పొరపాటు చేస్తే రూ.2 లక్షల జరిమానా!

రైలు లోపలి భాగంలో ముఖ్యాంశాలు:

  • ప్రీమియం ఫస్ట్ క్లాస్ క్యాబిన్
  • సౌకర్యవంతమైన సీట్లు, స్లీపర్ బెర్తులు
  • వాటర్‌ బాటిల్ హోల్డర్
  • రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు
  • ఆటోమేటిక్ డోర్లు, విమానం లాంటి ఇంటీరియర్స్

రైలు వేగం, లక్షణాలు:

  • వేగం: 160 కి.మీ/గం
  • గరిష్ట వేగం: 180 కి.మీ/గం
  • ప్రయాణికుల సామర్థ్యం: సుమారు 1,128

భద్రతా చర్యలు, సౌకర్యాలు:

ఇది క్రాష్ బఫర్‌లు, డిఫార్మేషన్ ట్యూబ్‌లను కలిగి ఉంటుంది. కోచ్‌ల మధ్య ఫైర్‌ఫ్రూప్‌ లాంటి ఇంటీరియల్‌ ఏర్పాటు చేశారు. ఈ రైలులో Wi-Fi యాక్సెస్, ఆధునిక స్లీపర్ బెర్త్‌లు, ఎయిర్‌లైన్ తరహా ఇంటీరియర్ ఉంటాయి.

ఈ మార్గంలో నడవడానికి మొదటి అవకాశం:

ఈ మార్గాన్ని ఇంకా ఖరారు చేయనప్పటికీ, ఈ రైలు ఢిల్- పాట్నా మధ్య నడపవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తాత్కాలిక బయలుదేరే సమయాలు పాట్నా నుండి రాత్రి 8:00 గంటలు, ఢిల్లీలో ఉదయం 7:30 గంటలుగా అంచనా వేశారు. చిన్న స్టేషన్లలో 2-3 నిమిషాలు స్టాప్‌లు ఉంటాయి, ఢిల్లీ కాంట్, జైపూర్ వంటి పెద్ద స్టేషన్లలో ఎక్కువసేపు స్టాప్‌లు ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Gold Price: రికార్డ్‌ సృష్టిస్తున్న పసిడి.. తులంపై 2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర

వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు:

  • ఫస్ట్ ఏసీ
  • సెకండ్‌ AC (2 టైర్)
  • థర్డ్ AC (3 టైర్)

ఈ రైలును BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) తయారు చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) డిజైన్, సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. కైనెట్ రైల్వే సొల్యూషన్స్‌కు ఇలాంటి 120 రైళ్లను నిర్మించే కాంట్రాక్టు లభించింది. మొత్తం ఖర్చు $6.5 బిలియన్లు (సుమారు రూ.54,000 కోట్లు)గా అంచనా వేశారు. వీటిని మహారాష్ట్రలోని లాతూర్‌లో తయారు చేస్తున్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఛార్జీల కంటే టికెట్ ఛార్జీలు దాదాపు 10–15% ఎక్కువగా ఉంటాయని అంచనా. ఇది వెళ్లే మార్గాన్ని బట్టి టికెట్‌ ధరల్లో తేడా ఉండవచ్చు.

Vande Bharat Sleeper Train

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?