2000 Note: వెనక్కి తీసుకుంటున్న రూ.2000 నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా..?
మార్కెట్ నుంచి 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఆ నోట్లను బ్యాంకులో మార్చుకున్నారు. 2000 రూపాయల నోట్లలో కనీసం 50 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు..
మార్కెట్ నుంచి 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఆ నోట్లను బ్యాంకులో మార్చుకున్నారు. 2000 రూపాయల నోట్లలో కనీసం 50 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 1.80 లక్షల కోట్ల 2000 రూపాయల నోట్లు వచ్చాయని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వివరించారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. ఆ నోట్లను ఏం చేస్తారు? వీటిని ఇతర నోట్ల ముద్రణకు ఉపయోగిస్తారా? లేకా పారేస్తారా? అని.
నివేదికల ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ మొదటగా ప్రాంతీయ శాఖల కార్యాలయాలకు నోట్లను పంపుతుంది. అప్పుడు వాటిలో నకిలీ నోట్లు ఉన్నాయా..? ఎన్ని ఉన్నాయి? ఇది యంత్రం సహాయంతో తనిఖీ చేస్తారు. దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొన్ని నోట్లను తగులబెట్టిన సంగతి తెలిసిందే. అలాగే నోట్లు చిన్న ముక్కలుగా యంత్రం ద్వారా కట్ చేస్తారు. నోట్లు మంచి స్థితిలో ఉంటే వాటిని కొత్త నోట్లుగా మారుస్తారు. ఇక దెబ్బతిన్న నోట్స్ ఉంటే కార్డ్‌బోర్డు తయారీలో ఉపయోగిస్తారు.
2016లో డీమోనిటైజేషన్ జరిగినప్పుడు బ్యాంకులు అన్ని నోట్లను ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేశాయి. తర్వాత ఆ నోట్లను కిలో చొప్పున వివిధ ఫ్యాక్టరీలకు విక్రయించారు. ఈ విధంగా దాదాపు 800 టన్నుల నోట్లు అమ్ముడుపోయాయి. 2000 రూపాయల నోటు ముద్రణకు 4 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే 500 రూపాయల నోట్లను ముద్రించడానికి 1 రూపాయి ఖర్చవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి