PNB Digital Payment: పీఎన్‌బీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక కొత్త ఫీచర్‌ ద్వారా డిజిటల్ చెల్లింపులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐబీఆర్‌ ఆధారిత యూపీఐ పరిష్కారాన్ని ప్రారంభించింది. దీంతో ఏవీఆర్ ఆధారిత యూపీఐ ద్వారా చెల్లింపు సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రభుత్వ రంగంలో తొలి బ్యాంక్‌గా అవతరించింది. ఇప్పుడు ఫీచర్ ఫోన్‌ని కలిగి ఉన్న వినియోగదారులు దాని IVR నంబర్‌ను..

PNB Digital Payment: పీఎన్‌బీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక కొత్త ఫీచర్‌ ద్వారా డిజిటల్ చెల్లింపులు
Pnb Digital Payment
Follow us
Subhash Goud

|

Updated on: Jun 12, 2023 | 2:29 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐబీఆర్‌ ఆధారిత యూపీఐ పరిష్కారాన్ని ప్రారంభించింది. దీంతో ఏవీఆర్ ఆధారిత యూపీఐ ద్వారా చెల్లింపు సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రభుత్వ రంగంలో తొలి బ్యాంక్‌గా అవతరించింది. ఇప్పుడు ఫీచర్ ఫోన్‌ని కలిగి ఉన్న వినియోగదారులు దాని IVR నంబర్‌ను ఉపయోగించి UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు కూడా చేయవచ్చు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ పీఎన్‌బీ 2025 నాటికి డిజిటల్ విజన్ కింద కార్డ్‌లెస్, క్యాష్‌లెస్ సొసైటీని సృష్టించడానికి యూపీఐ 23PAY IVR ఆధారిత UPI పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇప్పుడు ఫీచర్ ఫోన్ వినియోగదారులు కూడా యూపీఐ చెల్లింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా కూడా చెల్లించవచ్చు:

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) రియల్ టైమ్తక్షణ చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తుంది. దీనిని 24 గంటల్లో ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఇప్పటి వరకు యూపీఐ ద్వారా చెల్లింపు సౌకర్యం స్మార్ట్‌ఫోన్ లేదా యూఎస్‌ఎస్‌డీ ద్వారా చెల్లింపు సౌకర్యంగా ఉండేది. అలాగే మీరు ఇంటర్నెట్‌ని ఉపయోగించడం ద్వారా మాత్రమే చెల్లింపు చేయగలరు. అయితే ఇప్పుడు యూపీఐ 123PAY ద్వారా పీఎన్‌బీ వినియోగదారులు ఇంటర్నెట్ లేకుండా కూడా చెల్లింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా ఫీచర్ ఫోన్‌లో లేదా తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో UPI లావాదేవీలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

గ్రామీణ, చిన్న పట్టణాలలో ఎక్కువ మంది వినియోగదారులు

భారతదేశంలో అత్యధిక జనాభా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాలలో ఉందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవో తెలిపారు. అలాంటి వారు ఇప్పటికీ నగదు కంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. పీఎన్‌బీకి చెందిన 63 శాతం శాఖలు గ్రామీణ, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాల్లో పీఎన్‌బీకి పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

UPI 123PAYతో ఎలా చెల్లించాలి?

ముందుగా మీ ఫోన్ నుండి IVR నంబర్ 9188-123-123కి డయల్ చేయండి. తర్వాత మీ లావాదేవీని ప్రామాణీకరించండి మీరు చాలా భాషలను ఎంచుకుని కూడా UPI 123PAYని ఉపయోగించవచ్చు. పీఎన్‌బీ కాని కస్టమర్లకు కూడా సౌకర్యం స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని వారికి ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుందని ఎండీ తెలిపారు. UPI 123PAY సౌకర్యం అటువంటి వారికి పూర్తిగా సహాయం చేస్తుంది. దీని సహాయంతో భారతదేశంలో ఎక్కడైనా చెల్లింపు చేయవచ్చు. ఈ సదుపాయం పీఎన్‌బీ కాని కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?