AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Loans: కరోనా కష్టకాలంలో RBI గుడ్‌న్యూస్…బ్యాంకులకు కీలక ఆదేశాలు

కరోనా కష్టకాలాన్ని గట్టెక్కేందుకు పలువురు బ్యాంకుల రుణాలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక ఆదేశాలు జారీ చేసింది.

New Loans: కరోనా కష్టకాలంలో RBI గుడ్‌న్యూస్...బ్యాంకులకు కీలక ఆదేశాలు
RBI News
Janardhan Veluru
| Edited By: Ram Naramaneni|

Updated on: Apr 13, 2021 | 11:46 AM

Share

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి అన్ని వర్గాలను వణికిస్తోంది. మరీ ముఖ్యంగా నష్టభయంతో బ్యాంకులు వణికిపోతున్నాయి. కోవిడ్ ఉధృతి ప్రభావం రుణగ్రహీతలపై ఏ మేరకు ఉంటుందోనని ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా రుణాలు ఇవ్వడం కరెక్టేనా? అనే అంశంపై బ్యాంకర్లు మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంకులకు క్లారిటీ ఇచ్చింది. కరోనా కారణంగా ఇబ్బందిపడుతున్న వ్యక్తులు, సంస్థలకు రుణాల మంజూరును ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టంచేశారు. రుణాల మంజూరును ఆపేయడం సరికాదని తేల్చిచెప్పారు.

ఆర్థిక వ్యవస్థ పురోగతికి రుణాల మంజూరు కొనసాగాల్సిన అవసరముందని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సూచించారు. రుణాల మంజూరును ఆపేస్తే…అది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని స్పష్టంచేశారు. కరోనా ఉధృతి కారణంగా నెలకొంటున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ఉండాలని కోరారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమర్థవంతంగా వ్యూహాలు అమలు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. కస్టమర్ల సేవలకు అంతరాయం కలగకుండా పేమెంట్స్, ఇతర ఐటీ సేవలపై ప్రత్యేక దృష్టిసారించాలని దాస్ కోరారు.

మారటోరియంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రుణగ్రహీతలకు మళ్లీ లోన్ మారటోరియం కల్పించే యోచన లేదని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టంచేయడం తెలిసిందే. ప్రస్తుతం మారటోరియం వసతిని కల్పించాల్సిన పరిస్థితులు లేవన్న ఆయన…ప్రస్తుత పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మార్కెట్ ఇప్పటికే సన్నద్ధమైయ్యిందని చెప్పారు.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్‌డేట్… కోవిడ్ కారణంగా మార్కెట్లో నష్టభయాలు నెలకొనడంతో సోమవారం భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు…మంగళవారం పుంజుకున్నాయి. ఉదయం నుంచే స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48 వేల పాయింట్ల ఎగువున ట్రేడ్ అవుతుండగా…నిఫ్టీ 14,350 పాయింట్ల ఎగువున ట్రేడింగ్ అవుతోంది. కొద్దిసేపటి క్రితం సెన్సెక్స్ 183 పాయింట్ల లాభంతో 48,066 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా…నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 14,370 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మహీంద్ర అండ్ మహీంద్ర, బజాజ్ ఫినాన్స్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి..Coronavirus updates: దేశంలో ఆగని కరోనా ఉధృతి..కొత్తగా 1.61 లక్షల కోవిడ్ కేసులు

Ragi Java: ఎండకాలంలో రాగిజావ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. రాగుల్లో ఉండే ప్రోటీన్స్‌ ఏమిటి..?