AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kotak Mahindra Bank: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బంపర్ ఆఫర్ మీకోసమే..

Kotak Mahindra Bank: హౌస్‌ లోన్‌ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త. కోటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్‌ లోన్స్‌కు సంబంధించి..

Kotak Mahindra Bank: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బంపర్ ఆఫర్ మీకోసమే..
Kotak Bank
Shiva Prajapati
|

Updated on: Apr 13, 2021 | 12:41 PM

Share

Kotak Mahindra Bank: హౌస్‌ లోన్‌ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త. కోటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్‌ లోన్స్‌కు సంబంధించి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్‌బీఐ విధానాల నేపథ్యంలో దాదాపు అన్ని బ్యాంకులు హోమ్ లోన్స్‌పై ఇచ్చే వడ్డీ రేట్లను భారీగా పెంచగా.. కోటక్ మహీంద్రా బ్యాంకు అలా చేయలేదు. వడ్డీ రేట్‌ను స్థిరంగా ఉంచింది. దాంతో దేశంలో అన్ని బ్యాంకుల్లో కెల్లా కోటక్ బ్యాంక్‌లో మాత్రమే అత్యల్ప వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ లభిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేట్లను 6.70 శాతం నుంచి 6.95 శాతానికి పెంచగా.. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మాత్రం 6.65 వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ వడ్డీ రేట్లు అన్ని మొత్తాల రుణాలకు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. కాగా, తాజా కస్టమర్లతో పాటు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్లు కూడా రెండు సంవత్సరాల కాలపరిమితితో సంవత్సరానికి 6.65 వడ్డీ రేట్లకు హోమ్ లోన్స్ పొందే అవకాశం ఉంది. అయితే, అయితే రుణగ్రహీతల క్రెడిట్ స్కోరు, ఎల్‌టివి రేషియో ఆధారంగా వడ్డీ రేట్లు ఉంటాయని కోటాక్ మహీంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది.

దీనిపై కోటక్ మహీంద్రా బ్యాంక్ కన్స్యూమర్స్ విభాగం అధిపతి అంబూజ్ చంద్‌నా మాట్లాడుతూ.. “కొంతకాలంగా గృహ విక్రయాల్లో పురోగతి కనిపిస్తోంది. దానికి కారణం వడ్డీ రేట్లలో మార్పులే. స్థిరమైన వడ్డీ రేట్లు వినియోగదారులు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. కోటక్ బ్యాంక్.. ఇళ్లు కొనాలనుకునే వారికి అండగా ఉంటుంది. మా కస్టమర్లకు మేం భరోసా ఇవ్వాలనుకుంటున్నాం. కోటక్ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65% మారబోదు. నాణ్యమైన ఇంటి నిర్మాణానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాం.’’ అని చెప్పుకొచ్చారు.

కోటక్ బ్యాంక్ హోమ్‌ లోన్స్ ప్రత్యేకతలు..: గృహ రుణాలు, బ్యాలెన్స్ బదిలీ రుణాలపై వడ్డీ 6.65% నుండి ప్రారంభమవుతుంది. 6.65% వడ్డీ రేటు అన్ని రుణ మొత్తాలకు వర్తిస్తుంది. శాలరీ, స్వయం ఉపాధి పొందే కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తోంది. కోటక్ డిజి హోమ్‌ లోన్స్‌ పేరుతో తక్షణమే రుణాలను మంజూరు చేస్తోంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?.. హోమ్ లోన్స్ కావాలనుకునే వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కస్టమర్లు కోటక్ బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్లి హోమ్‌ లోన్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలోని కోటక్ బ్యాంక్‌కు సంబంధించిన ఏ ఇతర శాఖల్లో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మొబైల్ బ్యాంకింగ్ యాప్, నెట్ బ్యాంకిగ్ ద్వారా కూడా హోమ్ లోన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు.

Also read:

Low-Cost House: తక్కువ ఖర్చుతో 15 రోజుల్లో మైక్రో ఇల్లు రూపకల్పన చేసిన అమ్మాయిపై కవిత ప్రశంసల వర్షం

Israel King Solomon: ఏకంగా 700మందిని పెళ్లిళ్లు చేసుకున్న ఆదేశపు రాజు.. వారిలో విదేశీ యువరాణిలు కూడా