AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Low-Cost House: తక్కువ ఖర్చుతో 15 రోజుల్లో మైక్రో ఇల్లు రూపకల్పన చేసిన అమ్మాయిపై కవిత ప్రశంసల వర్షం

Micro House:సాధారణంగా ఓ పక్కా ఇల్లు నిర్మించాలంటే ఈజీగా 4 లేదా 5 నెలల సమయం పడుతుంది అలాగే రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ కేవలం 15 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తిచేయొచ్చంటే...

Low-Cost House: తక్కువ ఖర్చుతో 15 రోజుల్లో మైక్రో ఇల్లు రూపకల్పన చేసిన అమ్మాయిపై కవిత ప్రశంసల వర్షం
Kavita
Surya Kala
|

Updated on: Apr 13, 2021 | 12:31 PM

Share

Micro House:సాధారణంగా ఓ పక్కా ఇల్లు నిర్మించాలంటే ఈజీగా 4 లేదా 5 నెలల సమయం పడుతుంది అలాగే రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ కేవలం 15 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తిచేయొచ్చంటే మీరు నమ్ముతారా..? అవును మీరు విన్నది నిజమే.. కేవలం15 రోజుల వ్యవధిలో ఓ సిమెంటు పైపులో బ్రహ్మాండమైన మైక్రో ఇంటికి రూప కల్పన చేసింది మన తెలంగాణ అమ్మాయి. కాంక్రీటు పైపు లోపల సింగిల్ బెడ్ రూమ్ ఇల్లును రూపొందించిన తెలంగాణ యువ ఇంజనీర్ ప్రతిభ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంతకీ ఆ కాంక్రీటు పైపులో మైక్రో ఇల్లు విశేషాలు తెలుసుకుందాం.

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామానికి చెందిన పేరాల మానసారెడ్డి సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పొందింది. అనంతరం వివిధ దేశాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా,తక్కువ ఖర్చుతో ఇండ్లను నిర్మిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన మానస, వాటి ఆధారంగా తక్కువ ఖర్చుతో ఇంటి డైజన్లను రూపొందించింది. ఓ కాంక్రీట్‌ పైపులో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్‌ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇంటిని నిర్మించి ఔరా అనిపిస్తోంది. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్‌ ఇళ్లు.. 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుంది.

2000 మిల్లీమీటర్ల నిడివి కలిగి ఉన్న పైపుల్లో 120 చదరపు అడుగుల బిల్ట్‌అప్‌ ఏరియాతో సింగిల్‌ బెడ్రూం ఓపాడ్‌లను ఆవిష్కరించింది మానసారెడ్డి. కాంక్రీటు పైపులో అటువంటి అద్భుతమైన ఇంటిని హైదరాబాద్‌లోని చెంగిచెర్లలో ఓపాడ్‌ను రూపొందించింది. అంతేకాకుండా ఈ ఇంటిని ఒకసారి నిర్మించిన తర్వాత దానిని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చనీ..అంతేకాదు ఈ ఓపాడ్‌లోనే ఫర్నీచర్‌ కూడా అందిస్తున్నామనీ తెలిపింది తెలంగాణ యువ ఇంజనీరు మానసారెడ్డి. కాగా, నూతన ఆవిష్కరణలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇండ్లను నిర్మిస్తున్న యువతి పేరాల మానస రెడ్డిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు.

Also Read:   ఏకంగా 700మందిని పెళ్లిళ్లు చేసుకున్న ఆదేశపు రాజు.. వారిలో విదేశీ యువరాణిలు కూడా

ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు రుచిగా పర్ఫెక్ట్ గా చేసుకోండిలా …