Telangana: పాపం – ప్రాయశ్చిత్తం : చెట్లు నరికిన చేతుల్తోనే.. మొక్కలు నాటిస్తున్న అటవీశాఖ అధికారులు
భూమి మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం అంటే కుదరదు. ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది. చెట్లు నాటాలన్నా.. నరకాలన్నా.. పర్మిషన్లు తప్పనిసరి...
భూమి మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం అంటే కుదరదు. ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది. చెట్లు నాటాలన్నా.. నరకాలన్నా.. పర్మిషన్లు తప్పనిసరి. ఇలానే వెంచర్లో చెట్లు నరికేసి.. పచ్చదనాన్ని సర్వనాశనం చేసిన వారికి భారీ జరిమాలు విధించారు అధికారులు. పచ్చని చెట్లు కనిపిస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది. ఈ ఎండాకాలంలో కాసింత నీడనిస్తోందని మనసు తేలికపడుతుంది. కాని కొంతమంది కేటుగాళ్లకు మాత్రం ఈ చెట్లను ఎప్పుడెప్పుడు నరుకుదామా అని చూస్తున్నారు. అలా ఫారెస్ట్ అధికారుల కళ్లుగప్పి చెట్లు నరికిన బరితెగింపుగాళ్లకు భారీ జరిమానా పడింది. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున చెట్లు కొట్టేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బుద్ధిచెప్పింది అటవీ శాఖ. వెంచర్ ను విస్తరించటంలో భాగంగా వందలాది చెట్లను నరికేసిన సంస్థకు ఇరవై లక్షల రూపాయల భారీ జరిమానాను విధించి, వసూలు చేసింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బొమ్మరాస్ పేట్ లో జరిగింది ఘటన. వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్స్ లో పది రోజుల కిందట భారీగా చెట్లను సరికివేశారు. ఫిర్యాదు అందుకున్న మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు విచారణ జరిపించారు. వెంచర్స్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది భారీ వృక్షాలను నరికేసిన విషయాన్ని నిర్థారించారు. వాల్టా యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు కోల్పోయిన పచ్చదనానికి బదులుగా భారీగా జరిమానా విధించారు. అదే సంస్థతో మళ్లీ పెద్ద ఎత్తున మొక్కలు కూడా నాటిస్తామని అధికారులు తెలిపారు. సొంత భూముల్లో అయినా చెట్లు కొట్టేందుకు అటవీ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఆన్ లైన్ లోనూ అప్లయ్ చేసుకోవచ్చన్నారు అధికారులు. ఎవరైనా చెట్లు కొట్టేందుకు అనుమతి కోరితే, విచారణ జరిపి, నిబంధనల ప్రకారం అనుమతి ఇస్తామన్నారు. తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపుకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చెట్ల నరికి వేతను నివారించాలంటున్నారు అధికారులు.
పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్