AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TIMS Recruitment 2021: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..

TIMS Notification 2021: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(TIMS)లో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్..

TIMS Recruitment 2021: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..
Tims Jobs
Shiva Prajapati
|

Updated on: Apr 13, 2021 | 1:18 PM

Share

TIMS Notification 2021: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(TIMS)లో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.199 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టిమ్స్ డైరెక్టర్ పేరిట ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాల్లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ పూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటి నర్సింగ్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్, డైటీషియన్, ఫార్మాసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాగా, ఈ పోస్టులన్నింటినీ వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అప్లికేషన్ ఫారం https://dme.telangana.gov.in/లో అందుబాటులో ఉంటుందని ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కూడా అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని స్పష్టం చేశారు.

పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీలు- 199 మెడికల్ ఆఫీసర్- 94 ప్రొఫెసర్- 12 అసోసియేట్ ప్రొఫెసర్- 23 అసిస్టెంట్ ప్రొఫెసర్- 22 నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2- 1 అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా హెడ్ నర్స్- 6 స్టాఫ్ నర్స్- 32 డైటీషియన్- 1 ఫార్మాసిస్ట్- 8

వాక్ ఇన్ ఇంటర్వ్యూ సమయం: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, డైటీషియన్ పోస్టులకు ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టులకు ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్/మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. వయసు: 2021 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు నిండరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు ఉంటాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ట వయస్సు 65 ఏళ్లు. ఇంటర్వ్యూ జరిగే స్థలం- తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లా.

Also read:

Prema Entha Madhuram: తెలుగు బుల్లి తెరపై హల్ చల్ చేస్తున్న కన్నడ సోయగాలు. ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ అను.

Covid Centers: ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. టాప్ ప్రైవేటు ఆసుపత్రులు కూడా కోవిడ్ సెంటర్లే.. ఆదేశాలు జారీ

Follow Us
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!