Covid Centers: ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. టాప్ ప్రైవేటు ఆసుపత్రులు కూడా కోవిడ్ సెంటర్లే.. ఆదేశాలు జారీ
Private Hospitals: దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా లక్షన్నర కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం వేలల్లో కేసులు,
Private Hospitals: దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా లక్షన్నర కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం వేలల్లో కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రాజధానిలోని ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. చాలాచోట్ల బెడ్ల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని 14 ప్రైవేట్ ఆసుపత్రులను పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్లుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఆసుపత్రుల్లో డిల్లీలోనే టాప్ ఆసుత్రులు కూడా ఉన్నాయి. వీటిలో ప్రముఖ సర్ గంగారామ్ ఆసుపత్రి, ఇంద్రప్రస్త అపోలో కూడా ఉన్నాయి.
ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ 14 ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేవలం కరోనా పేషెంట్లను మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని, ఇతర రోగులను చేర్చుకోవద్దంటూ ఆదేశించింది. దీంతోపాటు కనీసం 60 శాతం ఐసీయూ బెడ్లను కరోనా రోగుల చికిత్స కోసం కేటాయించాలని 101 ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ సెంటర్లుగా మారిన ప్రవేటు ఆసుపత్రుల వివరాలు.. ఇంద్రప్రస్త అపోలో ఆసుపత్రి.. సర్ గంగారామ్, హోలీ ఫ్యామిలీ, మహారాజా అగ్రసేన్, మ్యాక్స్ ఎస్ఎస్, ఫోర్టిస్, మ్యాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ, వెంకటేశ్వర్, శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్, జైపూర్ గోల్డెన్, మాతా చనన్ దేవి, పుష్పావతి సింఘానియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మణిపాల్, సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉన్నాయి.
కాగా.. ఢిల్లీలో సోమవారం కొత్తగా 11,491 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 72 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: