కుమార్తె అదృశ్యం.. లంచం కోసం పోలీసుల వేధింపులు.. తండ్రి ఆత్మహత్య

Uttar Pradesh Crime News : కుమార్తె తప్పిపోయిందనే బాధలో తండ్రి ఉంటే ఆమె జాడ కనుక్కోవాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఓ ఎస్సై. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీసులు ఏ

కుమార్తె అదృశ్యం.. లంచం కోసం పోలీసుల వేధింపులు.. తండ్రి ఆత్మహత్య
Uttar Pradesh Crime News
Follow us
uppula Raju

|

Updated on: Apr 13, 2021 | 1:53 PM

Uttar Pradesh Crime News : కుమార్తె తప్పిపోయిందనే బాధలో తండ్రి ఉంటే ఆమె జాడ కనుక్కోవాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఓ ఎస్సై. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీసులు ఏ పనిచేయడానికైనా ఇలా లంచాలు ఇవ్వాలని జనాలను పీడిస్తున్నారు. వచ్చే జీతంతోపాటు అక్రమంగా కోట్లు కూడబెడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎస్సై చేసిన ఘన కార్యానికి ఓ అమాయకుడు బలైపోయాడు. పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందని శిశుపాల్ తన కుమార్తెను బంటి, ముఖేష్, దినేష్‌ బైక్‌పై అపహరించారని రామ్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి కంప్లెంట్ ఇచ్చాడు. తన కుమార్తెను వెతకడానికి సాయం చేయాలని కోరాడు. ఏప్రిల్ 9న స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు.

ఇదిలా ఉంటే రామ్‌నగర్ పోలీసు అవుట్‌ పోస్ట్ ఇన్‌ఛార్జి రామ్ రతన్ సింగ్ సదరు వ్యక్తిని లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్పుడే మీ కూతురిని వెతకడానికి సాయం చేస్తానని తెలిపాడు. అప్పటి వరకు కేసు ముందుకు వెళ్లదని బెదిరించాడు. కూతరు కనిపించడం లేదని మనోవేదనకు గురైన అయనను డబ్బుకోసం రామ్‌ రతన్‌ సింగ్ మరింత వేధించసాగాడు. దీంతో మనస్తాపానికి గురైన శిశుపాల్ లెటర్ రాసి చంద్‌పూర్‌ గ్రామంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్సై రామ్ రతన్ సింగ్ సూసైడ్‌ లెటర్ చూసి చింపేసి జేబులో పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సదరు ఎస్సైని పట్టుకొని స్టేషన్‌కి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లే శిశుపాల్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సబ్‌ ఇన్‌స్పెక్టర్ రామ్ రతన్ సింగ్‌ను సస్పెండ్ చేశామని, అతడిపై కమిటీ వేసి దర్యాప్తు చేస్తున్నామని కుటుంబ సభ్యులను శాంతింప జేయడానికి ప్రయత్నించారు.

Ugadi 2021: సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్

CBSE Exams 2021: బోర్డు పరీక్షలు రద్దు చేయండి.. లేకపోతే కరోనా ప్రళయమే: సీఎం కేజ్రీవాల్

Ugadi: ఈ ఏడాది ఓ పెద్దనేతకు ఇబ్బందికర పరిస్థితులు.. విశాఖ శ్రీ శారదాపీఠం ఉగాది వేడుకల్లో స్వరూపానందేంద్ర స్వామి

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..