Ugadi 2021: సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్

Ugadi 2021: కోవిడ్ నిబంధనలను పాటిస్తూ. తెలుగువారి లోగిళ్లలో ఉగాది పండగను జరుపుకుంటున్నారు. ఏపీ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా...

  • Surya Kala
  • Publish Date - 1:47 pm, Tue, 13 April 21
Ugadi 2021: సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్
Ugadi Festival

Ugadi 2021: కోవిడ్ నిబంధనలను పాటిస్తూ. తెలుగువారి లోగిళ్లలో ఉగాది పండగను జరుపుకుంటున్నారు. ఏపీ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలోసీఎం జగన్, మంత్రులు పాల్గొన్నారు. తెలుగువారి పండగ సందర్భంగా జగన్ సాంప్రదాయ దుస్తులలో పంచె కట్టుతో వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్‌ జగన్‌ సన్మానించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేద పండితులు పూజలు చేశారు.

కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి చెప్పారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ సమర్ధవంతంగా అమలు చేస్తారని.. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయని చెప్పారు. ఈ ఏడాది సీఎం జగన్ తన పాలనలో ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్  తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని కోరుకున్నారు. అంతేకాదు ఈ ఏడాది కూడా వానలు కురిసి పంటలు బాగా పండాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలన్నారు.

 

Also Read: ప్రపంచంలోనే అతిపెద్ద చికెన్ ఎగ్ రోల్.. దీనిని ఎంతమంది తయారు చేస్తారంటే..!

తెలుగు బుల్లి తెరపై హల్ చల్ చేస్తున్న కన్నడ సోయగాలు. ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ అను.