AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prema Entha Madhuram: తెలుగు బుల్లి తెరపై హల్ చల్ చేస్తున్న కన్నడ సోయగాలు. ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ అను.

Prema Entha Madhuram Serial: బుల్లి తెరపై హీరోయిన్ గా నటించే వారు తమ అందం అభినయంతో ఇప్పుడు వెండి తెరపై హీరోయిన్లతో సమానంగా పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంటున్నారు. బుల్లితెర ప్రేక్షకులను..

Prema Entha Madhuram: తెలుగు బుల్లి తెరపై హల్ చల్ చేస్తున్న కన్నడ సోయగాలు. ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ అను.
Prema Enta Madhuram
Surya Kala
|

Updated on: Apr 13, 2021 | 1:05 PM

Share

Prema Entha Madhuram Serial: బుల్లి తెరపై హీరోయిన్ గా నటించే వారు తమ అందం అభినయంతో ఇప్పుడు వెండి తెరపై హీరోయిన్లతో సమానంగా పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంటున్నారు. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ.. మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. ప్రముఖ సీరియల్ కార్తీక్ దీపంలో హీరోయిన్ వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథన్ కు అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. అయితే అంతే స్థాయిలో మరో బుల్లి తెర హీరోయిన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె ప్రముఖ జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్లో హీరోయిన్ అను. నటన మీద ఆసక్తి లేకుండా అనుకోకుండా నటి అయ్యింది. తెలుగువారి ఆదరణ సొంతం చేసుకున్న ఈ అను స్వస్థలం కర్ణాటక.

25ఏళ్ల అను 1996 జులై 1న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. సెయింట్ యాన్స్ ప్రి యూనివర్సిటీ ఆఫ్ గర్ల్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ప్రస్తుతం 25ఏళ్ళు పూర్తవుతాయి.ఇంకా పెళ్లి కాలేదు. అను అసలు పేరు వర్ష హెచ్. కె. అయితే అను,వర్ష అనే నిక్ నేమ్స్ తో ఎక్కువ పాపులర్ అయ్యింది. దీంతో అందరికీ అనుగా సుపరిచితం.

అయితే అను అనుకోకుండా స్నేహితురాలితో పాటు మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అలా మోడలింగ్ రంగంలో ఉన్న సమయంలో కన్నడలో నాగమండలం సీరియల్ లో లీడ్ రోల్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సీరియల్ అక్కడ సూపర్ హిట్.. అంతేకాదు.. అను నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. దీంతో వెంటనే కస్తూరి నివాస్ సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. అందులో నటిస్తున్న సమయంలో తెలుగులో ప్రేమ ఎంత మధురం సీరియల్ లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. దీంతో ఆ సీరియల్ నుంచి బయటకు వచ్చి ప్రేమ ఎంత మధురం తో తెలుగు వారి లోగిళ్ళలో అడుగు పెట్టింది.

ఓవైపు సీరియల్స్ లో నటిస్తూనే అను కొన్ని షార్ట్స్ ఫిల్మ్స్ లో కూడా నటించింది. హీరో పునీత్ రాజ్ కుమార్, హీరోయిన్ సౌందర్య లు తన అభిమాన హీరో హీరోయిన్లు అని చెబుతున్న అను కు తెలుగులో ప్రభాస్ అంటే ఇష్టమట.. అంతేకాదు. సాహు మూవీ తన ఫేవరేట్ మూవీ అంటుంది చిన్నది.

Also Read: ఏకంగా 700మందిని పెళ్లిళ్లు చేసుకున్న ఆదేశపు రాజు.. వారిలో విదేశీ యువరాణిలు కూడా

తక్కువ ఖర్చుతో 15 రోజుల్లో మైక్రో ఇల్లు రూపకల్పన చేసిన అమ్మాయిపై కవిత ప్రశంసల వర్షం