Coronavirus updates: దేశంలో ఆగని కరోనా ఉధృతి..కొత్తగా 1.61 లక్షల కోవిడ్ కేసులు
Covid-19 News Updates: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గం.ల వ్యవధిలో 1,61,736 కొత్త కోవిడ్19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గం.ల వ్యవధిలో దేశంలో కొత్తగా 1,61,736 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. కరోనా కాటుకు 879 మంది మృతి చెందటంతో మొత్తం మరణాల సంఖ్య 1,71,058కి చేరింది. నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గాయి.
దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కి చేరుకుంది. అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్‌ను వెనక్కినెట్టి భారత్ రెండో స్థానంలోకి చేరగా…అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. భారత్‌లో ఇప్పటి వరకు 1,22,53,697 మంది కోవిడ్ నుంచి కోలుకోగా…ప్రస్తుతం 12,64,698 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
India reports 1,61,736 new #COVID19 cases, 97,168 discharges and 879 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,36,89,453 Total recoveries: 1,22,53,697 Active cases: 12,64,698 Death toll: 1,71,058
Total vaccination: 10,85,33,085 pic.twitter.com/ndxnchFoIp
— ANI (@ANI) April 13, 2021
దేశంలో ఇప్పటి వరకు 10.85 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.