Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని.. తెలుగులో ఏమని ట్విట్ చేశారో తెలుసా..?

2021 ugadi: తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రపంచంలోని పలుచోట్ల ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ప్లవ నామ సంవత్సరం

Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని.. తెలుగులో ఏమని ట్విట్ చేశారో తెలుసా..?
Ram Nath Kovind, Narendra Modi
Follow us

|

Updated on: Apr 13, 2021 | 11:05 AM

Ugadi 2021 celebration: తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రపంచంలోని పలుచోట్ల ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ప్లవ నామ సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఇలా ట్విట్ చేశారు. ‘‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.’’ అంటూ ట్విట్ చేశారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ట్విట్‌లో ఇలా రాశారు.. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అంటూ పేర్కొన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్‌లో ఇలా రాశారు.. ‘‘తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వసంతం మీ జీవితాల్లోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకువచ్చే సంతోషాల నావలో ప్రయాణంలా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.ఏటా ఉగాదిని బంధు మిత్రులతో కలిసి ఆనందంగా నిర్వహించుకునే వాళ్ళం. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ, అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నాను.’’ అంటూ ట్విట్ చేశారు.

Also Read:

Hyderabad: భాగ్యనగరంలో కొత్త ట్రెండ్.. మసాజ్ ముసుగులో వ్యభిచారం.. మోడల్స్‌తో వల..

Vaishno Devi’s Navaratri 1stday: కరోనా నిబంధనల మధ్య ప్రారంభమైన వైష్ణవిదేవి అమ్మవారి శార్దియా నవరాత్రి వేడుకలు