RBI: మరో సంచలన నిర్ణయం దిశగా ఆర్‌బీఐ..! తగ్గనున్న ఛార్జీలు.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
ప్రజలకు త్వరలో ఆర్‌బీఐ మరో శుభవార్త చెప్పేందుకు సిద్దమైంది. ఇటీవల వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో కోట్లాది మంది ప్రజలకు లాభం చేకూరనుంది. దీని వల్ల లోన్లు పొందినవారికి ఈఎంఐ తగ్గనుంది. త్వరలో బ్యాంకింగ్ వినియోగదారులకు లాభం జరిగేలా మరో నిర్ణయం వెలువడనుంది.

RBI New Rules: బ్యాంకింగ్ వినియోగదారులకు మేలు చేకూర్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరంతరం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రజలకు మరో శుభవార్త తెలపనుంది. బ్యాంక్ అకౌంట్ల ఉన్నవారితో పాటు లోన్లు తీసుకునేవారికి ఊరట కల్పించింది. ఈ మేరకు త్వరలో అన్ని బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అన్ని బ్యాంకులు ఏదైనా సర్వీస్‌కు ఒకే ఫీజు వసూలు చేసేలా ఆర్‌బీఐ ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ విషయమై అన్ని బ్యాంకులతో కీలక చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఆర్‌బీఐ ఒక సర్వీస్‌కు అన్ని బ్యాంకులు ఒకేలా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసేలా కీలక మార్పులు అమల్లోకి తీసుకురానుందని తెలుస్తోంది.
అన్నీ బ్యాంకుల్లో ఒకే ఫీజు
ఇప్పటివరకు బ్యాంకింగ్ సేవలు, లోన్లకు ప్రాసెసింగ్, ఏటీఎం, ట్రాన్సక్షన్, మెయింటనెన్స్, ఇతర ఫీజలు లాంటివి ఒక్కో బ్యాంక్ ఒక్కొలా వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తక్కువ ఫీజుతో సేవలు అందిస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు అధిక మొత్తంలో కలెక్ట్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ వినియోగదారులకు మెరుగైన సేవలు, పారదర్శకత తెచ్చేందుకు అన్ని బ్యాంకుల్లో ఒకే రకంగా ఫీజులు ఉండేలా కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. ఒక్కొ బ్యాంక్ ఒక్కొలా ఫీజు వసూలు చేయడం వల్ల ప్రజలు పోల్చి చూసుకోవడం కూడా కష్టంగా మారింది. అంతేకాకుండా ఒక సేవ కోసం వివిధ పేర్లతో వివిధ మార్గాల్లో బ్యాంకులు కస్టమర్ల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నాయి. దీని వల్ల కస్టమర్లు పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. వీటి భారం తగ్గించేందుకు అన్నీ బ్యాంకులు ఒకేలా వసూలు చేసేలా ఏకీకృత విధానం ఆర్‌బీఐ తీసుకురానుందని సమాచారం. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.
త్వరలోనే మార్గదర్శకాలు
ఇప్పటివరకు ప్రాసెసింగ్, ఇతర ఫీజులకు సంబంధించి ఒక విధానం లేకపోవడం వల్ల బ్యాంకులు ఇష్టారీతిగా కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. అదనపు ఛార్జీల వల్ల కస్టమర్లు నష్టపోతున్నారు. అదే ఒకే విధమైన ఫీజులు అమల్లోకి వస్తే బ్యాంకింగ్ వినియోగదారులకు లాభం జరుగనుంది. ఏ సేవకు ఎంత ధర అనేది కస్టమర్లకు కూడా తెలుస్తుంది. దీంతో వేరే బ్యాంకుతో పోల్చి చూసుకోవాల్సిన పని కూడా ఉండదు. బ్యాంకులతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే దీనిపై ఆర్‌బీఐ నుంచి మార్గదర్శకాలు వస్తాయని చెబుతున్నారు.
