AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Gift: రాఖీ రోజున బంగారం బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా.. నకిలీ బంగారాన్ని ఇలా గుర్తించండి..

బంగారం బహుమతిగా ఇవ్వాలనుకునే వారు బహుమతులు కొనడానికి బంగారు దుకాణానికి వెళతారు. అసలు బంగారాన్ని, నకిలీ బంగారాన్ని ఎలా వేరు చేయాలో వారికి తెలియాలి. ఇలా తెలుసుకోవడం వలన బంగారం కొనుగులు చేసే సమయంలో మోసం బారిన పడరు. ఏ ఆభరణమైనా 22 లేదా 18 క్యారెట్ల బంగారంతో చేసినవేనని గుర్తుంచుకోండి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,850గా ఉంది.

Rakhi Gift: రాఖీ రోజున బంగారం బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా.. నకిలీ బంగారాన్ని ఇలా గుర్తించండి..
Rakhi Festival
Surya Kala
|

Updated on: Aug 19, 2024 | 11:53 AM

Share

రాఖీ పండగ రోజున తనకు రక్షను కట్టిన సోదరీమణులకు సోదరుడు బహుమతిని ఇస్తాడు. ఇది ఒక సంప్రదాయం. ఇందులో అన్నాదమ్ములు బంగారం మాత్రమే బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు బహుమతులు ఇస్తారు. అయితే బంగారం బహుమతిగా ఇవ్వాలనుకునే వారు బహుమతులు కొనడానికి బంగారు దుకాణానికి వెళతారు. అసలు బంగారాన్ని, నకిలీ బంగారాన్ని ఎలా వేరు చేయాలో వారికి తెలియాలి. ఇలా తెలుసుకోవడం వలన బంగారం కొనుగులు చేసే సమయంలో మోసం బారిన పడరు. ఏ ఆభరణమైనా 22 లేదా 18 క్యారెట్ల బంగారంతో చేసినవేనని గుర్తుంచుకోండి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,850గా ఉంది.

ఇలా చేస్తే నకిలీ బంగారాన్ని గుర్తించవచ్చు

  1. నిజమైన బంగారాన్ని గుర్తించడంలో అయస్కాంతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బంగారం నిజమో, నకిలీదో తెలుసుకోవాలంటే దానిని బంగారంపై అతికించండి. బంగారం నిజమైనదైతే అయస్కాంతం దానికి అంటుకోదు. అయితే బంగారంపై అయస్కాంతం ప్రభావం చూపితే, మీ బంగారం నకిలీదని అర్థం చేసుకోవాలి.
  2. బంగారం కొనుగోలు చేసేటప్పుడు బంగారంపై ఉన్న హాల్‌మార్కింగ్‌ను చూడటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాల్‌మార్క్ బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. అందుకే జూన్‌ 1 నుంచి బంగారంపై హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇప్పుడు బంగారం కొనడానికి వెళితే, హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే కొనండి, లేకపోతే భవిష్యత్ లో ఇబ్బందుల్లో పడవచ్చు.
  3. నిజమైన బంగారాన్ని గుర్తించడానికి నీరు కూడా సులభమైన మార్గం. మీ వద్ద ఉన్న బంగారాన్ని నీటిలో వేయడానికి ప్రయత్నించండి. మీ బంగారం నీటిపై తేలితే మీ బంగారం నకిలీదని అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజమైన బంగారం ఎప్పుడూ నీటిపై తేలదు. ఇంట్లో కూర్చొనే ఈ పరీక్షను సులభంగా చేయవచ్చు.
  4. నిజమైన బంగారాన్ని గుర్తించడంలో నైట్రిక్ యాసిడ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బంగారాన్ని గీత గీసి దానిపై కొద్దిగా నైట్రిక్ యాసిడ్ వేయండి. నైట్రిక్ యాసిడ్ మీ బంగారంపై ప్రభావం చూపకపోతే.. ఆ బంగారం నిజమైనదని అర్థం చేసుకోండి. మరోవైపు నైట్రిక్ యాసిడ్ జోడించడం బంగారంపై ప్రభావం చూపితే లేదా దాని రంగు మారితే ఆ బంగారం నకిలీదని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..