Indian Railway: ఇంటర్‌సిటీ ద్వారా ప్రయాణించే వారి కోసం రైల్వే మంత్రి కీలక ప్రకటన..!

Indian Railway: రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. దీని వల్ల తరచుగా రైలులో ప్రయాణించే వారికి ఎంతగానో ఉపయోగాలు ఉంటాయి..

Indian Railway: ఇంటర్‌సిటీ ద్వారా ప్రయాణించే వారి కోసం రైల్వే మంత్రి కీలక ప్రకటన..!
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Sep 28, 2022 | 9:08 AM

Indian Railway: రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. దీని వల్ల తరచుగా రైలులో ప్రయాణించే వారికి ఎంతగానో ఉపయోగాలు ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యాలపై రైల్వేశాఖ నిరంతరం కృషి చేస్తోంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేయడమే రైల్వే ఉద్దేశం. ఇందుకోసం రైల్వేశాఖ సరికొత్త ప్రణాళికతో కసరత్తు చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే నిరంతరం మార్పులు చేస్తోంది. ఈసారి శతాబ్ది, జనశతాబ్ది, ఇంటర్‌సిటీ రైళ్ల స్థానంలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. దీంతో ప్రతి రోజు ప్రయాణించే లక్షలాది మందికి ఈ సదుపాయం ఉపయోగపడనుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మూడు రైళ్ల స్థానంలో సెమీ-హై స్పీడ్ రైలు వందే భారత్‌ను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది.

శతాబ్ది, జన శతాబ్ది, ఇంటర్‌సిటీ ప్రయాణికులు వందే భారత్ రైలులో ప్రయాణించడం వల్ల ప్రయాణం మునుపటి కంటే మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రధాని మోదీ ప్రకటన ప్రకారం.. 75 నగరాలను వందేభారత్ రైలుతో అనుసంధానించడానికి రైల్వే వేగంగా కృషి చేస్తోంది. వందే భారత్ రైలు మూడో మార్గాన్ని త్వరలో ప్రకటించబోతున్నారు. ఈ రైలు ముంబై నుండి అహ్మదాబాద్ మార్గంలో నడపాలని భావిస్తున్నారు. ఆగస్ట్ 15, 2023 నాటికి 75 నగరాలను వందే భారత్ రైళ్లతో అనుసంధానించాలని రైల్వే యోచిస్తోంది.

కొత్త వందే భారత్ పాత రైలు నుంచి అనేక అంశాల్లో 27 మార్గాల పనులు పూర్తయ్యాయి. త్వరలో దీనిని వాణిజ్య మార్గంలో నడపనున్నారు. దీని గురించి సమాచారం ఇస్తూ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాబోయే రోజుల్లో వందేభారత్ రైళ్ల స్థానంలో శతాబ్ది, జన శతాబ్ది, ఇంటర్‌సిటీ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే 27 మార్గాలను ఎంపిక చేశారు.

ఇవి కూడా చదవండి

మొదటి దశలో ఢిల్లీ-లక్నో, ఢిల్లీ-అమృతసర్, పూరీ హౌరాతో సహా 27 రూట్లలో వందే భారత్‌ను నడుపుతామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. దీని తర్వాత భవిష్యత్తులో ఢిల్లీ-భోపాల్, ఢిల్లీ-చండీగఢ్ రైల్వే రూట్లలో నడిచే శతాబ్ది రైళ్లను మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి