AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB ఖాతాదారులకు గుడ్ న్యూస్‌..! వడ్డీరేట్ల తగ్గింపు.. ఎంత తగ్గించిందంటే..?

PNB Clients: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రెపో రేటు ఆధారంగా వడ్డీ రేట్లను తగ్గించింది. 6.80 శాతం నుంచి 6.55 శాతానికి తగ్గించింది.

PNB ఖాతాదారులకు గుడ్ న్యూస్‌..! వడ్డీరేట్ల తగ్గింపు.. ఎంత తగ్గించిందంటే..?
PNB
uppula Raju
|

Updated on: Sep 17, 2021 | 3:38 PM

Share

PNB Clients: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రెపో రేటు ఆధారంగా వడ్డీ రేట్లను తగ్గించింది. 6.80 శాతం నుంచి 6.55 శాతానికి తగ్గించింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 17 శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు చాలా బ్యాంకులు తమ గృహ రుణాలను రెపో రేటుకు లింక్ చేయడం ప్రారంభించాయి. దీంతో రెపో రేటు తగ్గినప్పుడు రుణగ్రహీతలు వెంటనే ప్రయోజనం పొందుతారు. రెపో రేటు అంటే RBI నుంచి బ్యాంకులు తీసుకునే రుణం రేటు.

PNB వినియోగదారులకు బహుమతి దసరా, దీపావళికి ముందు చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. SBI తరువాత ఇప్పుడు PNB కూడా ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి రెపో రేటు ఆధారంగా రుణాల వడ్డీ రేట్లు 6.55 శాతానికి తగ్గాయి. ఇది వినియోగదారులకు గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది. గృహ రుణ EMI 0.25%తగ్గిస్తారు.

ఈ బ్యాంకులు రుణాలను చౌకగా చేశాయి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బిఐ పండుగ రుణ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజులను కూడా రద్దు చేసింది. SBI రుణ వడ్డీ రేట్లపై 0.05 శాతం తగ్గింపు ప్రకటించింది. ఇప్పుడు SBI కొత్త వడ్డీ రేట్లు 7.45 శాతంగా మారాయి. ఇది కాకుండా బ్యాంక్ రుణ రేటు (PLR) లో 5 బేసిస్ బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటించింది. తర్వాత అది 12.20 శాతంగా ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) గృహ రుణాలు, ఆటో రుణాలపై 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించింది. దీని తరువాత గృహ రుణం 6.75 శాతానికి అందిస్తారు. ఇది కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేసింది. ప్రైవేట్ రంగ పెద్ద బ్యాంకు కొటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేటును 0.15 శాతం తగ్గించింది. బ్యాంక్ ఇప్పుడు 6.50 శాతం చొప్పున గృహ రుణాన్ని అందిస్తోంది. ఈ గృహ రుణాలు నవంబర్ 8 వరకు రెండు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

14 సంవత్సరాల తర్వాత తల్లీబిడ్డలను కలిపిన ఫేస్‌బుక్‌..! ఆరేళ్ల వయసులో దూరమైన కూతురు..

Amit Shah tour: బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు.. నిర్మల్‌ చేరుకున్న అమిత్ షా

IRCTC: సముద్రంలో సరదాగా.. కుటుంబంతో జాలీగా.. అందాల లక్ష ద్వీప్ చూట్టేయండి ఇలా!

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్