AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇల్లు కొనే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి! లేదంటే చాలా నష్టపోతారు

సొంత ఇల్లు కొనుగోలు చేయడం ఒక జీవిత లక్ష్యం. అయితే రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో మోసాలను నివారించడానికి నిపుణులు కీలక జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆస్తి యజమానిని ధృవీకరించడం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (EC), RERA నమోదు, కంప్లీషన్ (CC), ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) తప్పనిసరిగా తనిఖీ చేయాలి.

ఇల్లు కొనే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి! లేదంటే చాలా నష్టపోతారు
Home Buying
SN Pasha
|

Updated on: Feb 28, 2026 | 11:00 PM

Share

సొంత ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం ప్రతి కుటుంబానికి జీవిత లక్ష్యంగా ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో చిన్న అజాగ్రత్త కూడా పెద్ద ఆర్థిక ఇబ్బందులకు దారితీయొచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆస్తి పత్రాలపై సంతకం చేసే ముందు కీలక విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. మొదటగా ఇల్లు అమ్ముతున్న వ్యక్తి నిజమైన యజమాని కాదా అన్నది నిర్ధారించుకోవడం అత్యంత ముఖ్యం. ఆస్తిపై అతనికి పూర్తి హక్కు ఉందో లేదో సంబంధిత పత్రాలతో ధృవీకరించాలి. అలాగే తహసీల్దార్ లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (EC) తీసుకోవడం అవసరం.

దీని ద్వారా ఆస్తిపై పాత రుణాలు, కోర్టు వివాదాలు లేదా బ్యాంకు బకాయిలు ఉన్నాయా అనే విషయం స్పష్టమవుతుంది. ఏదైనా చట్టపరమైన సమస్య ఉన్న ఆస్తిని కొనకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేస్తే, ఆ ప్రాజెక్ట్ RERAలో నమోదు అయిందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలి. బిల్డర్ నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్ (CC) మరియు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) పొందడం కూడా కీలకం. OC లేకుండా ఇంట్లో నివసించడం చట్టబద్ధంగా సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ మ్యాప్‌కు ప్రభుత్వ అనుమతి ఉందో లేదో కూడా తెలుసుకోవాలి.

స్థానం కూడా ఆస్తి విలువను నిర్ణయించే ప్రధాన అంశం. ఆఫీసులు, పాఠశాలలు, ఆసుపత్రులు, మెట్రో లేదా బస్ సౌకర్యాలు ఎంత దగ్గరలో ఉన్నాయో పరిశీలించాలి. భవిష్యత్తులో ఆ ప్రాంత అభివృద్ధి అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం పెట్టుబడికి ఉపయోగకరం. ఇంటి ధర మాత్రమే మొత్తం ఖర్చు కాదని గుర్తుంచుకోవాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, GST, హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు, న్యాయవాది ఫీజులు వంటి అదనపు వ్యయాలు కూడా బడ్జెట్‌లో కలపాలి. చివరగా, సైట్‌ను స్వయంగా పరిశీలించి గాలి, వెలుతురు, నీటి సరఫరా, విద్యుత్, నిర్మాణ నాణ్యత వంటి అంశాలను చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలతో ముందుకు వెళితే సొంత ఇల్లు కల సురక్షితంగా నిజమవుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us