Kotak Mahindra Bank FD: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! ఆ బ్యాంకు వడ్డీ రేటు భారీగా పెరిగింది..
ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకూ కాల వ్యవధిలోని డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 2.75 శాతం నుంచి 6.20 శాతం వరకూ సీనియర్ సిటిజనులకు 3.25శాతం నుంచి 6.70 శాతం వడ్డీ రేటును అందించనున్నట్లు పేర్కొంది.
ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ కోటక్ మహీంద్రా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. రూ. 2 కోట్ల కన్నా తక్కువ వేసే డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేటు అమలవుతుందని ప్రకటించింది. ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకూ కాల వ్యవధిలోని డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 2.75 శాతం నుంచి 6.20 శాతం వరకూ సీనియర్ సిటిజనులకు 3.25శాతం నుంచి 6.70 శాతం వడ్డీ రేటును అందించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 17 నుంచి ఈ పెంపు అమలవుతుందని బ్యాంకు ప్రకటించింది. కనీసం 390 రోజులు అంటే 12 నెలల 25 రోజుల కాల వ్యవధి నుంచి రెండేళ్ల వరకూ మెచ్యూరిటీని పెట్టుకుంటే సాధారణ ప్రజలకు 7.20 శాతం, వృద్ధులకు 7.70 శాతం వడ్డీ రేటు వస్తుంది.
రెపో రేటు పెంచిన రిజర్వ్ బ్యాంక్..
ఫిబ్రవరి 8న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన రెపో రేటును 25 బేస్ పాయింట్లు పెంచి 6.50% చేసింది. ఇప్పటి వరకు మొత్తం రెపో రేటు 250 బీపీఎస్ పెరిగింది. డిసెంబర్ 2022లో, RBI వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్లు పెంచింది. మేలో 40 ఆపై జూన్, ఆగస్టు ,సెప్టెంబర్‌లలో వరుసగా 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈక్రమంలో వడ్డీ రేట్లు రుణ రేట్లు పెరుగుతున్నాయి.
పూర్తి వివరాలు ఇవి..
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏడు నుంచి 14 రోజుల వ్యవధి గల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 2.75శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 15 నుంచి 30 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.00% వడ్డీ రేటును అందిస్తోంది. 31 నుంచి 45 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 3.25%, 46 నుండి 90 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 3.50% ఉంది. 91 నుంచి 120 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు 4.00% వడ్డీని పొందుతాయి. 121 నుండి 179 రోజులలో మెచ్యూర్ అయినవి ఇప్పుడు 4.25% వడ్డీని పొందుతాయి. 180 రోజుల నుండి 363 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.00% వడ్డీ రేటును ఇస్తోంది, 364 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.25% వడ్డీ రేటును అందిస్తోంది. 365 రోజుల నుండి 389 రోజుల వరకు ఉన్న డిపాజిట్లపై 7.00% 390 రోజుల (12 నెలల 25 రోజులు) నుండి రెండు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.20% వడ్డీ అందిస్తోంది. అందే సీనియర్ సిటిజెన్ లకు అయితే 7.70 శాతం వడ్డీ వస్తుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల్లో చెల్లించాల్సిన డిపాజిట్లపై ఇప్పుడు 6.75% వడ్డీ లభిస్తుండగా, మూడు నుంచి నాలుగేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.50% వడ్డీ లభిస్తుంది. 4 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలవ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వరుసగా 6.25%, 6.20% వడ్డీ రేటును చెల్లిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..