Rajeev Kanakala: అతడు తల్చుకుంటే మళ్లీ స్టార్ హీరో అవకాశాలున్నాయ్.. కానీ.. రాజీవ్ కనకాల కామెంట్స్..
తెలుగు చలనచిత్ర, టెలివిజన్ రంగాల్లో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజీవ్ కనకాల. సహాయ నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. సినిమాల్లోకి రాకముందు రాజీవ్ దూరదర్శన్ లో వచ్చిన పలు ప్రజాదరణ పొందిన సీరియల్స్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజీవ్ కనకాల. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఇండస్ట్రీలో తనకున్న సన్నిహిత స్నేహాల గురించి , తోటి నటుల కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) , లవర్ బాయ్ తరుణ్ (Tarun) లతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. కెరీర్ ప్రారంభం నుండి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనిపై రాజీవ్ మాట్లాడుతూ… “గతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్టీఆర్‌ని కలవడం కొంచెం తగ్గింది. దానికి కారణం ఆయన తన సినిమాలతో ఎంతో బిజీగా ఉండటం, అలాగే ఇద్దరికీ కుటుంబ బాధ్యతలు పెరగడమే. కానీ మా మధ్య ఉన్న స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది.
ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..
ఇటీవల ‘RRR’ సినిమాలో కూడా నేను నటించాను, అందులో ఎన్టీఆర్ పాత్రను ఇంట్రడ్యూస్ చేసేది నా పాత్రే కావడం విశేషం. అప్పుడప్పుడు లొకేషన్‌కి రమ్మని ఎన్టీఆర్ పిలుస్తుంటారు, కానీ కుదరక వెళ్ళలేకపోతుంటాను” అని తెలిపారు. ఒకప్పుడు వరుస విజయాలతో లవర్ బాయ్‌గా దూసుకుపోయిన తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తరుణ్‌తో తనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని రాజీవ్ చెప్పారు. తరుణ్ కెరీర్ గురించి మాట్లాడుతూ, ఆయన తలుచుకుంటే ఇప్పటికైనా ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం రెగ్యులర్ కమర్షియల్ హీరో పాత్రలే కాకుండా, హీరోగానే ఉంటూ విభిన్నమైన, కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటే తరుణ్ అద్భుతాలు సృష్టిస్తారని రాజీవ్ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..
ఇండస్ట్రీలో గతంలో ఉన్న పరిస్థితులకు, ఇప్పటికీ చాలా తేడా వచ్చిందని రాజీవ్ చెప్పుకొచ్చారు. ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి రాకముందు నటులు కేవలం వెండితెరపై హీరోగా మాత్రమే కనిపించాలనే కొన్ని పరిమితులకు లోబడి ఉండేవారని, కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందని చెప్పారు. నటులు విభిన్నమైన పాత్రలు చేయడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయని, త్వరలోనే తరుణ్, శివబాలాజీ లాంటి నటులు సరికొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..
