Union Budget: బడ్జెట్ వేళ దేశ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు.. ఎంతంటే..?
యూరోపియన్ యూనియన్‌తో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. దీని ప్రభావంతో ఈయూ నుంచి ఇండియాకు వచ్చే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఏయే ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు చూద్దాం.

బడ్జెట్ సమావేశాల వేళ దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ అందింది. దేశంలోనే పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు యూరోపియన్ యూనియన్‌తో భారత్ కీలక వాణిజ్య ఒప్పందం జరిగింది. ప్రధాని మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా లూయిస్ శాంటోస్ డా కోస్తా సమక్షంలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో పాటు యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా ఎక్స్‌లో వెల్లడించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, ఇదొక పెద్ద డీల్‌గా తెలిపారు. ఈ డీల్‌తో రెండు దేశాలకు ప్రయోజనం జరగనుందని, ఇది ప్రారంభం మాత్రమేనని తెలిపారు. రెండు దేశాల మధ్య వ్యూహత్మాక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో భారత్‌లో పలు వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. అవేంటో చూద్దాం.
తగ్గనున్న వస్తువుల ధరలు
-కార్లు, బీర్, విస్కీ, వోడ్కా, ఆలివ్ ఆయిల్, కివీస్, వైన్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్, కూరగాయల నూనె ధరలు తగ్గనున్నాయి -ఈయూ దేశాల నుంచి భారత్‌కు ఈ వస్తువులు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. అక్కడ నుంచి దిగుమతి చేసుకునే 96.6 శాతం వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. దీని వల్ల వాటి ధరలు తగ్గనున్నాయి. భారతదేశం నుంచి ఈయూకి ఎగుమతి అయ్యే వస్తువులపై కూడా 96.6శాతం సుంకాలను తొలగిస్తామని యూరోపియన్ యూనియన్ తెలిపింది. దీంతో భారత్ నుంచి ఈయూకి ఎగుమతి అయ్యే వస్తువులకు కూడా లాభం జరగనుంది -స్పిరిట్‌లపై 40 శాతం సుంకాలను తగ్గించున్నారు – గ్రీన్ హౌస్, వాయు ఉద్గారాలను తగ్గించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సాయం అందించేందుకు రానున్న రెండేళ్లల్లో 500 మిలియన్ యూరోల సాయం అందించనుంది. -యూరోపియన్ అఫ్టికల్, సర్జికల్, మెడికల్ పరికరాలపై 90 శాతం సుంకాలు తొలగిస్తారు -భారతదేశం నుంచి వెళ్లే దాదాపు అన్ని ఈయూ విమానాలు, అంతరిక్ష నౌక ఎగుమతులపై సుంకాలు తొలగించనున్నారు -యంత్రాలపై 44 శాతం, రసాయనాలపై 22 శాతం, ఔషధాలరపై 11 శాతం వరకు సుంకాలు రద్దు అవుతాయి -2032 నాటికి భారతదేశానికి ఈయూ ఎగుమతులు రెట్టింపు చేయడంలో ఈ ఒప్పంద ఉపయోగపడనుంది
వాణిజ్య ఒప్పందం విలువ
ఈయూ, భారత్ మధ్య జరిగిన ఈ వాణిజ్య ఒప్పందం విలువ దాదాపు 136 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఆటోమొబైల్స్, వైన్లు, స్పిరిట్స్ వంటి వాటిపై ఈయూ సుంకం రాయితీలు ఇవ్వడానికి బదులుగా భారత్ వస్త్రాలు, తోలు, ఇతర సముద్ర ఉత్పత్తులపై సుంకాలు తగ్గించింది.
This agreement will drive trade, investment and innovation while strengthening our strategic relationship.
It reflects our shared resolve to shape a stable, prosperous and future-ready economic relationship. #IndiaEUTradeDeal @EU_Commission @vonderleyen https://t.co/f65vYIamAl
— Narendra Modi (@narendramodi) January 27, 2026
