LIC Scheme: ఈ స్కీమ్‌లో చేరితే పదేళ్ల పాటు నెలకు రూ.10వేల పెన్షన్ పొందవచ్చు.. ఎలాగంటే..!
LIC Scheme: ప్రస్తుతం ఎలాంటి రిస్క్ లేకుండా స్కీమ్ చాలా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ హామీతో ఉన్న పథకాలను ఎంచుకుంటే మంచి రాబడి..
LIC Scheme: ప్రస్తుతం ఎలాంటి రిస్క్ లేకుండా స్కీమ్ చాలా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ హామీతో ఉన్న పథకాలను ఎంచుకుంటే మంచి రాబడి పొందవచ్చు. అలాంటి స్కీమ్‌లలో ప్రధాన మంత్రి వయ వందన స్కీమ్ (PMVVY) ఒకటి. ఈ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు ఎంతో భద్రతగా ఉంటుంది. 60 ఏళ్లకంటే ఎక్కువ ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. 10 ఏళ్ల పాటు ఫించన్ అందుకోవచ్చు. ఈ స్కీమ్‌ను ఎల్‌ఐసీ నిర్వహిస్తుంది. ప్రస్తుత వడ్డీ రేటు 7.40 ఉంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు ముందుగా 2020 మార్చి 31 వరకు గడువు ఉండేది. దానిని 2023 మార్చి వరకు పొడిగించారు.
ఈ పథకంలో చేరాలనుకునే వారు ఆన్‌లైన్‌లో, ఎల్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా, ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి కూడా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఇక ఒక్కసారి ప్రీమియం చెల్లించి ఈ స్కీమ్‌లో చేరవచ్చు. కనీసం రూ.1.50 లక్షలు, గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టి పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ పథకంలో చేరిన తర్వాత 10 ఏళ్ల పాటు పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్ డెత్ బెనిఫిట్ కూడా ఉంది. పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి చెల్లిస్తారు.
రూ.1000 నుంచి రూ.10 వేల వరకు పెన్షన్: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌గా రూ.1.50 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు పెట్టిన తర్వాత నెల నెలా వడ్డీతో పింఛను అందజేస్తారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి నెల నెల చెల్లిస్తారు. వడ్డీ 7.40 శాతంగా నిర్ణయించారు. నెలకు రూ.1000 నుంచి దాదాపు రూ.10 వేల వరకు పింఛన్ లభిస్తుంది. ఒకవేళ మీరు నెలనెల వద్దు అనుకుంటే మూడు నెలలు, ఆరు నెలలకోసారి పింఛన్ పొందే సదుపాయం ఉంటుంది. నెలనెల బ్యాంకు ఖాతాకు ఫించన్ డబ్బులు జమ అవుతాయి.
పాలసీ గడువు 10 ఏళ్లు మాత్రమే. కనీస పెన్షన్ నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 వస్తాయి. గరిష్ట పెన్షన్ నెలకు రూ.10,000, మూడు నెలలకు రూ.30,000, ఆరు నెలలకు రూ.60,000, ఏడాదికి రూ.1,20,000 వస్తాయి. అయితే ఎన్ని నెలలకు ఓసారి పెన్షన్ తీసుకోవాలో అనే అంశాన్ని ముందే వెల్లడించాల్సి ఉంటుంది. పాలసీ మూడేళ్లు పూర్తయిన తర్వాత రుణం తీసుకోవచ్చు.10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది.
ఇవి కూడా చదవండి: