AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షల ఆదాయం.. కోటీశ్వరులను చేసే పథకం ఇది!

Best Scheme: ప్రస్తుతం పిపిఎఫ్ (PPF) పై ప్రభుత్వం ఏడాదికి 7.1% వడ్డీని అందిస్తోంది. ఈ పథకం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత పొందే మొత్తం రెండూ కూడా పూర్తిగా పన్ను రహితం (Tax Free). మీ..

Best Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షల ఆదాయం.. కోటీశ్వరులను చేసే పథకం ఇది!
Best Scheme
Subhash Goud
|

Updated on: Apr 26, 2026 | 12:22 PM

Share

Best Scheme: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోస్ట్ ఆఫీస్ (Post Office) నిర్వహించే పొదుపు పథకాలు కేవలం భద్రతకే కాదు. లాభసాటి రిటర్నులకు కూడా పేరుగాంచాయి. అందులోనూ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా భారీ నిధిని సమకూర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ పథకం ద్వారా కేవలం వడ్డీ రూపంలోనే రూ.18 లక్షలకు పైగా ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఆకర్షణీయమైన వడ్డీ రేటు – పన్ను మినహాయింపు

ప్రస్తుతం పిపిఎఫ్ (PPF) పై ప్రభుత్వం ఏడాదికి 7.1% వడ్డీని అందిస్తోంది. ఈ పథకం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత పొందే మొత్తం రెండూ కూడా పూర్తిగా పన్ను రహితం (Tax Free). మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇది ఒక సురక్షితమైన మార్గం. దీని మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అవసరమైతే మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్ల చొప్పున దీనిని పొడిగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: శాంతించిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

పెట్టుబడి పరిమితులు:

కనీస పెట్టుబడి: ఏడాదికి కేవలం రూ.500 తో కూడా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి: ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ఎవరు తెరవవచ్చు: భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. మైనర్ల తరపున వారి తల్లిదండ్రులు ఖాతాను నిర్వహించవచ్చు. (గమనిక: ఇందులో జాయింట్ అకౌంట్ సౌకర్యం లేదు).

పన్ను ప్రయోజనాలు (EEE స్టేటస్):

PPF పథకం EEE (Exempt-Exempt-Exempt) కేటగిరీ కిందకు వస్తుంది. అంటే:

  • మీరు పెట్టే పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
  • దీనిపై వచ్చే వడ్డీకి పన్ను ఉండదు.
  • మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తంపై కూడా పన్ను ఉండదు.

కేవలం వడ్డీతోనే ₹18 లక్షల ఆదాయం ఎలా?

మీరు ప్రతి సంవత్సరం గరిష్ట పరిమితి అయిన రూ.1,50,000ను పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుందాం:

  • 15 ఏళ్లలో మీ పెట్టుబడి: రూ.22,50,000.
  • 7.1% వడ్డీతో వచ్చే మొత్తం: రూ.18,18,209.
  • మెచ్యూరిటీ తర్వాత మొత్తం ఫండ్: రూ.40,68,209.
  • అంటే, మీరు దాచిన డబ్బు కాకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చే వడ్డీయే రూ.18 లక్షలకు పైగా ఉంటుంది.

కోటీశ్వరులు అయ్యే అవకాశం

మీరు 15 ఏళ్ల తర్వాత మీ ఖాతాను మరో రెండు సార్లు (ఐదేళ్ల చొప్పున) పొడిగించారనుకోండి:

  • 20 ఏళ్ల తర్వాత: మీ ఫండ్ విలువ సుమారు రూ.66.58 లక్షలకు చేరుతుంది.
  • 25 ఏళ్ల తర్వాత: మీరు మొత్తం రూ.37.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. వడ్డీ రూపంలోనే రూ.65.58 లక్షలు వస్తుంది. ఫలితంగా మీ చేతికి అందే మొత్తం రూ.1.03 కోట్లు దాటుతుంది. తక్కువ రిస్క్ తో, ప్రభుత్వ గ్యారెంటీతో కోటి రూపాయల నిధిని నిర్మించుకోవాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ పిపిఎఫ్ పథకం ఒక అద్భుతమైన ఎంపిక.

ఇది కూడా చదవండి: DMart: డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? సామాన్యుడి షాపింగ్ అడ్డా వెనుక అసలు సీక్రెట్స్ ఇవే!

ఇది కూడా చదవండి: Investment Tips: మీరు ఎందులోనైనా పెట్టుబడి పెడుతున్నారా? ముందు ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us