Post Office Interest Rates: పోస్టాఫీసులో వడ్డీల జాతర.. ఆ డిపాజిట్లపై గణనీయంగా వడ్డీ రేట్ల పెంపు
గతేడాది నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. గత రెండు త్రైమాసికాల నుంచి రెపో రేటును యథాతథంగా ఉంచడంతో ఈ వడ్డీ రేటు పెంపుదలకు బ్రేక్ పడింది. అయితే అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు ఒకే రకంగా ఉండడంతో కస్టమర్లకు ఆకర్షించడానికి ఇతర బ్యాంకుల కంటే 0.5 శాతం 1 శాతం వరకూ ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి.
కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన రాబడి కోసం వివిధ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడూతూ ఉంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు బ్యాంకుల కంటే పోస్టాఫీసుల్లో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే వినియోగదారుల ఆదరణ పొందడానికి ఇండియా పోస్ట్స్ కూడా అధిక వడ్డీని అందించేలా వివిధ పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. గతేడాది నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. గత రెండు త్రైమాసికాల నుంచి రెపో రేటును యథాతథంగా ఉంచడంతో ఈ వడ్డీ రేటు పెంపుదలకు బ్రేక్ పడింది. అయితే అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు ఒకే రకంగా ఉండడంతో కస్టమర్లకు ఆకర్షించడానికి ఇతర బ్యాంకుల కంటే 0.5 శాతం 1 శాతం వరకూ ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. బ్యాంకుల నుంచి ఊహించని పోటీ నేపథ్యంలో పోస్టల్ శాఖ కూడా ఓ ఏడాది టెర్మ్ డిపాజట్లపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. తపాలా శాఖ తాజాగా పెంచిన వడ్డీ రేట్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్/టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 2023-24 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ పోస్ట్ ఆఫీస్‌లో ఒక సంవత్సరం ఎఫ్‌డీ కోసం వడ్డీ రేటును పెంచింది. అదే సమయంలో ఇతర రేట్లను మార్చలేదు. అయితే సాధారణంగా పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులు వడ్డీ రేటును మరింత పెరుగుతుందని ఆశించారు. అయితే గత త్రైమాసికంలో వివిధ అవధుల కోసం పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 0.5 శాతం వరకు పెంచింది. కాబట్టి ఈ సారి మరింత పెంపు ప్రకటించలేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు 7.5 శాతం వరకు పెంచారు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పెట్టుబడిదారులు కనిష్ట మొత్తం రూ. 1000, ఆ తర్వాత రూ. 100 గుణిజాల్లో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఐదు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్‌లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీ మాత్ర పన్ను రహితం కాదని గుర్తుంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..