Senior Citizen FD: ఒక లక్షకు రూ. 1.15లక్షలు వడ్డీ వచ్చే స్కీమ్ ఇది.. ఈ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు..
అతి పెద్ద రుణదాతలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులైతే సీనియర్ సిటిజెనులకు 7.5శాతం వరకూ వడ్డీ రేటును అందిస్తున్నాయి. పోస్టు ఆఫీసుల్లో కూడా మంచి వడ్డీ రేటే వస్తుంది. ఈక్రమంలో ఈ మూడు ఆప్షన్లలో మీరు దేనిలో అధిక ప్రయోజనం పొందగలరో ఈ కథనంలో మీకు తెలియజేస్తున్నాం.
మన సమాజంలో డబ్బుల దాయాలి అనుకుంటే ముందు గుర్తొచ్చేది ఫిక్స్‌డ్ డిపాజిట్. సురక్షితమైన పెట్టుబడి కావడం, అధిక వడ్డీ వస్తుండటంతో అందరూ దీనికి మొగ్గుచూపుతారు. పలు బ్యాంకులు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. అతి పెద్ద రుణదాతలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులైతే సీనియర్ సిటిజెనులకు 7.5శాతం వరకూ వడ్డీ రేటును అందిస్తున్నాయి. పోస్టు ఆఫీసుల్లో కూడా మంచి వడ్డీ రేటే వస్తుంది. ఈక్రమంలో ఈ మూడు ఆప్షన్లలో మీరు దేనిలో అధిక ప్రయోజనం పొందగలరో ఈ కథనంలో మీకు తెలియజేస్తున్నాం. రూ. లక్ష విలువగలిగిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఏడాది నుంచి పదేళ్ల వరకూ ఎంత వడ్డీని అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ క్యాలిక్యులేషన్..
ఎస్బీఐలో రూ. లక్ష డిపాజిట్ చేస్తే దానిపై మీరు ఏడాదికి రూ. 6,396 సంపాదించవచ్చు. ఈ వ్యవధికి సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 6.25%. అదే మూడేళ్లకైతే రూ. లక్ష డిపాజిట్ పై సీనియర్ సిటిజన్లకు 7శాతం రేటుతో రూ. 23,144 వడ్డీగా వస్తుంది. రూ. లక్ష డిపాజిట్ పై ఐదేళ్లకైతే సీనియర్ సిటిజెన్లకు 7.5శాతం రేటు చొప్పున రూ. 44,995 వడ్డీని పొందవచ్చు. అదే పదేళ్లకు అయితే 7.5శాతం చొప్పున ఏకంగా రూ. 1,10,235 వడ్డీగా పొందవచ్చు.
హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్..
హెచ్ డీఎఫ్సీ బ్యాంకులో రూ. లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఏడాది కాలానికి సీనియర్ సిటిజెన్లకు 7.1శాతం వడ్డీ రేటు ప్రకారం డిపాజిట్ నగదుపై రూ. 7291 నగదు వడ్డీగా వస్తుంది. అదే నగదుపై మూడేళ్ల వ్యవధికి 7.5శాతం వడ్డీ రేటు వస్తుంది. అంటే డిపాజిట్ నగదుపై సీనియర్ సిటిజెన్లకు రూ. 24,972 వడ్డీ వస్తుంది. అలాగే రూ. లక్ష డిపాజిట్ పైనే ఏదేళ్ల కాలానికి 7.5శాతం వడ్డీ రేటు అందుతుంది. అంటే ఆ నగదుపై సినీయర్ సిటిజెన్లకు 7.5శాతం చొప్పున రూ. 44,995 నగదు వస్తుంది. అదే విధంగా 10 ఏళ్ల కాల వ్యవధికి 7.75 శాతం వడ్డీ రేటు ప్రకారం డిపాజిట్ చేసిన నగదుపై రూ. 1,15,456 నగదు వడ్డీ రూపంలో వస్తుంది.
పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ లెక్కింపు..
పోస్టు ఆఫీసులో రూ. లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మీరు ఏడాదిలో 6.8శాతం వడ్డీ రేటు ప్రకారం డిపాజిట్ పై రూ. 6,975 నగదు వడ్డీగా వస్తుంది. అదే నగదుపై మూడేళ్ల కాలానికి ఏడు శాతం వడ్డీ రేటు చొప్పున రూ. 23,144 నగదు వడ్డీగా వస్తుంది. అదే ఐదేళ్ల కాలానికి అయితే 7.5శాతం వడ్డీ రేటు చొప్పున రూ. 44,995 నగదును వడ్డీ రూపంలో పొందవచ్చు. పోస్ట్ ఆఫీసుల్లో పదేళ్ల కాలానికి ఫిక్స్ డ్ డిపాజిట్లను అందించదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..