మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..! అయితే నవంబర్‌ 30 లోపు 5లక్షలు మీ సొంతం..

Deposit Insurance: ప్రస్తుతం దేశంలోని అనేక సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం కింద నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ

మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..! అయితే నవంబర్‌ 30 లోపు 5లక్షలు మీ సొంతం..
Deposit Insurance
Follow us
uppula Raju

|

Updated on: Sep 18, 2021 | 3:17 PM

Deposit Insurance: ప్రస్తుతం దేశంలోని అనేక సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం కింద నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ బ్యాంకులలో ఫ్రాడ్‌ జరగడం వల్ల రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) వీటిని నిషేధించింది. దీంతో ఈ బ్యాంకు డిపాజిటర్లు నష్టపోకుండా ఉండేందుకు త్వరలో ఒక సెటిల్‌మెంట్ చేయనుంది. వచ్చే 90 రోజుల్లో డిపాజిటర్లకు రూ.5 లక్షలు చెల్లించాలని సెప్టెంబర్ 1న ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన నవంబర్ 30, 2021 వరకు డిపాజిటర్లు వారి డబ్బును తిరిగి పొందవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 27 న సర్క్యులర్ జారీ చేసింది.

డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) చట్టం, 2021 సెక్షన్ 1 ప్రకారం సబ్ సెక్షన్ (2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సెప్టెంబర్ 1వ తేదీన అమలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఆ డిపాజిటర్లందరు రూ.5 లక్షలు పొందుతారు. అయితే బ్యాంక్ డిపాజిట్ గ్యారెంటీ చట్టం ఆమోదం పొందకముందే మారటోరియంపై నడుస్తున్న బ్యాంకుల డిపాజిటర్లకు కూడా రూ.5 లక్షలు అందుతాయి. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ మారటోరియంలో నడుస్తున్న బ్యాంకులలో గుణలోని గ్రాహా కో-ఆపరేటివ్ బ్యాంక్, మధ్యప్రదేశ్‌కు చెందిన దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, విజయవాడ, నాసిక్‌లోని ఇండిపెండెన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పేర్లు ఉన్నాయి.

ఎవరు ఎలా డబ్బు పొందుతారు ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ 90 రోజుల కాలాన్ని 45-45 రోజులుగా విభజించింది. బ్యాంకులు మొదటి 45 రోజుల్లో తమ డిపాజిటర్ల రికార్డులను సేకరించి ఈ సమాచారాన్ని DICGC కి ఇస్తాయి. మిగతా 45 రోజుల్లో DICGC అన్ని క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తూ వస్తుంది. రూ.5 లక్షలు కస్టమర్లకు తిరిగి చెల్లిస్తుంది. గతంలో బ్యాంకులు ముంచేసిన డబ్బులు పొందడానికి 8-10 సంవత్సరాలు పట్టేది కానీ ఇప్పుడు అదే పని 90 రోజుల్లో కంప్లీట్‌ అవుతుందని ఇటీవల ఆర్థిక మంత్రి తెలిపారు. ఖాతాదారులకు 5 లక్షల రూపాయలు, బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్‌, వడ్డీ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎక్కువగా PMC బ్యాంక్ దీని ప్రయోజనాన్ని పొందుతుంది.

CBSE CTET 2021: CTET పరీక్ష తేదీలు విడుదల.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం..

Kiss in Bus: ‘గీతాగోవిందం’ సినిమా చూసి రెచ్చిపోయిన యువకుడు.. బస్సులో పక్క సీట్లో కూర్చున్న అమ్మాయిని..

Maestro Movie: తమన్నా బ్రెయిన్‌ను మార్చేశారు, ఎందుకలా చంపుతుందంటూ ఏడ్చేసిన దర్శకుడి కూతురు.. ఎందుకో తెలుసా?

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..