PM Kisan Yojana: పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు లేకుంటే ఏం చేయాలి..?

PM Kisan Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా రైతులకు మేలు కలిగే స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులు ఆర్థికంగా సాయం..

PM Kisan Yojana: పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు లేకుంటే ఏం చేయాలి..?
PM Kisan Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Jul 28, 2022 | 11:46 AM

PM Kisan Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా రైతులకు మేలు కలిగే స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులు ఆర్థికంగా సాయం అందుకోవచ్చు. ఇక మోడీ సర్కార్‌ రైతులకు ప్రవేశపెట్టిన పథకాలలో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఒకటి. అర్హులైన రైతులకు జూలై 31న రాబోయే 12వ విడతలో రూ.2000 సాయం అందుకోవచ్చని భావిస్తున్నారు. పీఎం కిసాన్‌ లబ్దిదారుల జాబితాలో అర్హులైన ఎవరైనా పేరు లేకుండా ఈ ప్రయోజనాన్ని కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని మార్గాల ద్వారా పరిహారం పొందవచ్చు.

జాబితాలో పేరు లేకుండా ఏం చేయాలి..?

మీరు పీఎం కిసాన్‌ పథకానికి అర్హులై ఉండి జాబితాలో పేరు లేకుండా టెన్షన్‌ పడొద్దు. మీ పేరును కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇందు కోసం కేంద్రం కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందు కోసం రైతులు వెబ్‌సైట్‌లో  రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్‌ కోసం అన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌, పట్టాపాస్‌ బుక్‌ వివరాలు నమోదు చేసుకుని ఈ ప్రయోజనం పొందవచ్చు. లేకుంటే ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 155261కు డయల్‌ చేయడం ద్వారా కూడా మళ్లీ మీ పేరును నమోదు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా మీ పేరును నమోదు చేసుకోవడానికి అవసరమైన అధికారులను ఇతర హెల్ఫ్లైన్‌ నంబర్‌ 011-24300606లో కూడా సంప్రదించవచ్చు. ఫోన్‌ నంబర్లు పని చేయకపోతే లబ్దిదారుల జాబితాలో పేర్లు లేని రైతు కుటుంబాన్ని తమ జిల్లాలోని జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కార మానిటరింగ్‌ కమిటీని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీ పేరును రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత జాబితాలో లబ్దిదారుని స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎలా తెలుసుకోవాలి..?

☛ PM Kisan అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

☛ హోమ్‌ పేజీలో ఉన్న ఫార్మర్స్‌కార్నర్‌ కేటగిరిలోకి వెళ్లండి

☛ ఈ విభాగంలో బెనిఫిషియరీ స్టేటస్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి

☛ ఆధార్‌ నంబర్‌, పీఎం కిసాన్‌ ఖాతా నంబర్‌ లేదా మీ రిజిస్ట్రేషన్‌ మొబైల్‌ నంబర్‌ వివరాలు నమోదు చేయాలి

☛ తర్వాత గెట్‌ డేటా ఎంపికపై క్లిక్‌ చేసి మీ పేరు స్థితిని తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్