AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money9: మరోసారి దివిస్‌ ల్యాబ్స్‌ షేర్‌ ఊపందుకునేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..!

Money9: ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా కరోనా మమహ్మారి కారణంగా కోట్లాది మంది తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయిన విషయం తెలిసిందే. ఎంతో మంది కరోనా బారిన పడి లక్షలాది రూపాయలను..

Money9: మరోసారి దివిస్‌ ల్యాబ్స్‌ షేర్‌ ఊపందుకునేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..!
Divis Labs
Subhash Goud
|

Updated on: Jul 28, 2022 | 1:54 PM

Share

Money9: ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా కరోనా మమహ్మారి కారణంగా కోట్లాది మంది తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయిన విషయం తెలిసిందే. ఎంతో మంది కరోనా బారిన పడి లక్షలాది రూపాయలను ఆస్పత్రుల్లో చికిత్స కోసం పెట్టుకున్నారు. ఈ సమయంలో కొన్ని ఫార్మా కంపెనీలకు పెద్ద లాభదాయకంగా మారింది. ఆస్పత్రులు, ఫార్మా కంపెనీలకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి. ఇటువంటి భారతీయ కంపెనీలలో దివీస్ లాబొరేటరీస్ (దివీస్ ల్యాబ్) ఒకటి. మార్చి 2020లో కరోనా కారణంగా భారతదేశంలో లాక్‌డౌన్ విధించబడినప్పుడు దివీస్ ల్యాబ్ వాటా ఒక్కో షేర్‌కు సుమారు రూ. 3,450 ఉండగా, దీని తర్వాత అక్టోబర్ 2021లో ఈ స్టాక్ షేర్‌ విలువ రూ.5372కి చేరుకుంది. అంటే, సుమారు ఒకటిన్నర సంవత్సరాలలో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 55 శాతం రాబడిని వచ్చిందనే చెప్పాలి. కానీ అక్టోబర్ 2021 తర్వాత స్టాక్ మళ్లీ నేల చూపులు చూడటం ప్రారంభమైంది. పెట్టుబడిదారులు స్టాక్‌లో ఎక్కువ నష్టపోయిన పరిస్థితి నెలకొంది.

నాలుగో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో అమ్మకాలతో భారీ లాభాలను నమోదు చేసినప్పటికీ, దివీస్ ల్యాబ్ స్టాక్ గత 3 నెలల్లో సుమారు 20 శాతం పడిపోయింది. అయితే ఈ సమయంలో ఫార్మా ఇండెక్స్ 11 శాతం మాత్రమే పడిపోయింది. ఇక మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.894 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే లాభంలో 78 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరిగి రూ.2518 కోట్ల స్థాయికి చేరుకుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో దివీస్ ల్యాబ్స్ షేర్‌లలో అగ్రగామిగా ఉంది.

బిజినెస్, స్టాక్ మార్కెట్ మరెన్నో విషయాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్నులు, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలను పలు భాషల్లో సులభంగా తెలుసుకోవచ్చు

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి