Petrol Diesel price Today: ఏపీలోనే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Petrol, Diesel Rates Today: దేశంలో చమురు ధరల నుంచి సామాన్యులకు కొంత ఉపశమనం లభిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం

Petrol Diesel price Today: ఏపీలోనే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Petrol Diesel price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 22, 2021 | 7:15 AM

Petrol, Diesel Rates Today: దేశంలో చమురు ధరల నుంచి సామాన్యులకు కొంత ఉపశమనం లభిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుల జేబులు గుల్లయ్యాయి. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరూ ఆందోళన చెందారు. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ దాటితే.. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. ప్రస్తుతం పెట్రో ధరలు అన్నిచోట్ల స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో ధరలిలా.. తెలంగాణలో.. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.26 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.29గా ఉంది. కాగా.. కరీంనగర్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో నిన్న లీటర్ పెట్రోల్ ధరరూ.96.52 ఉండగా.. గురువారం రూ.96.72 కి పెరిగింది. డీజిల్‌ ధర రూ.90.21 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 95.36 నుంచి 95.63కి పెరిగింది. డీజిల్‌ ధర రూ.89.17 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.38 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. బెంగాల్‌లోని కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

Also Read:

Covid 19 Vaccine: భారతీయులకు శుభవార్త.. ఆగస్టు నాటికి అందుబాటులోకి మరో వ్యాక్సిన్.. హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..