Covid 19 Vaccine: భారతీయులకు శుభవార్త.. ఆగస్టు నాటికి అందుబాటులోకి మరో వ్యాక్సిన్.. హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి

శ ప్రజలకు వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతోంది. మరోవైపు వ్యాక్సిన్ల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం మూడు టీకాలు అందుబాటులో ఉండగా ఇప్పుడు, మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది.

Covid 19 Vaccine: భారతీయులకు శుభవార్త.. ఆగస్టు నాటికి అందుబాటులోకి మరో వ్యాక్సిన్.. హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి
covid 19 Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 22, 2021 | 6:39 AM

Corona Vaccine: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌ ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో మూడు లక్షలకు చేరువైంది. ఒక వైపు, కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దేశ ప్రజలకు వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతోంది. మరోవైపు వ్యాక్సిన్ల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం భారత్‌లో కొవిషీల్డ్, కొవాగ్జిన్‌, రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌-వి’ టీకా అందుబాటులో ఉండగా ఇప్పుడు, మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది.

క‌రోనాను ధీటుగా ఎదుర్కొనాలంటే వ్యాక్సినేష‌నే ఉత్తమ ప‌రిష్కార మార్గమ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు నాటికి మనదేశంలో మరో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని బయోలాజికల్‌ ఇ (బీఈ) సంస్థ దీన్ని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయ్యాయి. త్వరలో మూడో దశ ట్రయల్స్‌ మొదలుకానున్నట్లు సమాచారం. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్‌లు ఉత్పత్తిచేయగల సామర్థ్యం ఈ కంపెనీకి ఉన్నందువల్ల ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం చాలా కీలక పరిణామం అవుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే కౌల్‌ అన్నారు.

దీంతోపాటు క్వాడ్‌ వ్యాక్సిన్‌ పార్టనర్‌షిప్‌లో భాగంగా అమెరికాలోని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ను కూడా బీఈ ఉత్పత్తి చేయనుంది. ఈమేరకు వైట్‌ హౌస్‌ ఒక ప్రకటనను విడుదల చేసింది. 2022 డిసెంబరు నాటికి బీఈ ద్వారా 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేయడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డెవల్‌పమెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సహకారంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. బీఈ వ్యాక్సిన్‌తోపాటు త్వరలోనే మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ కూడా ఆగస్టు నాటికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అమెరికా కంపెనీ నోవావ్యాక్స్‌, మనదేశంలోని సీరం ఇనిస్టిట్యూట్‌ కలిసి సెప్టెంబరుకు మరో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తోన్న ముక్కు ద్వారా ఇచ్చే ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ అక్టోబరులో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Read Also… Maharashtra : రేపటి నుంచి మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్‌.. రాత్రి 8 గంటల నుంచి మే 1 వరకు ఎక్కడికక్కడ బంద్

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ