Covid – 19 : దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం.. కనీవినీ ఎరుగని రీతిలో ఒక్కరోజులో మూడు లక్షల కేసులు
Corona cases in India : కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి..
Corona cases in India : కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ ఏకంగా ఒక్కరోజులో మూడు లక్షల కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటి వరకూ ఒక్కరోజులో ఇంత పెద్దమొత్తంలో కరోనా కేసులు ఇంతకుముందెన్నడూ నమోదు కాలేదు. ఇలా ఉండగా, గత ఐదు రోజుల నుంచి దేశంలో నిత్యం రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో మూడు లక్షల మార్కుకు చేరువ కాగా.. రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో (మంగళవారం).. 2,95,041 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2,023 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో మరణాల సంఖ్య రెండు వేలు దాటడం ఇదే మొదటిసారి. నిన్న కరోనా నుంచి 1,67,457 మంది బాధితులు కోలుకున్నారు. ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 16,39,357 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 20 వరకు మొత్తం 27,10,53,392 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటోంది.
Read also :Vikarabad : వికారాబాద్ డిపో మేనేజర్ హృదయం కదిలింది, బస్సే.. బస్ షెల్టర్ అయింది