Silver price today : సిల్వర్ కొనాలకునేవారికి మంచి ఛాన్స్.. స్థిరంగా ఉన్న వెండి ధరలు..
Silver Price Today: బంగారం ధరలు పరుగులు పెడుతుండగా.. వెండి ధరలలో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు.
Silver Price Today: బంగారం ధరలు పరుగులు పెడుతుండగా.. వెండి ధరలలో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు. బుధవారంతో పోల్చుకుంటే.. గురువారం ఉదయం కూడా సిల్వర్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. ఇది వెండి కొనాలకునేవారికి మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. పెళ్ళిళ్ల సీజన్ రాబోతుండడం.. కరోనా పరిస్థితుల మధ్య గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆల్ టైం రికార్డ్ ధరలను నమోదు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే బంగారం ధరలు గురువారం ఉదయం మరోసారి పెరిగాయి. కానీ వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.688 ఉండగా.. కిలో వెండి రూ.68,800గా ఉంది.
ప్రధాన నగరాల్లో ఉన్న ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.688 ఉండగా.. కేజీ ధర రూ.68,800కు చేరింది. అలాగే ముంబై మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.688 ఉండగా.. కిలో వెండి రూ.68,800గా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.739 దగ్గర ఉండగా.. కేజీ ధర రూ.73,900గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ పట్నం మార్కెట్లలో 10 గ్రాముల రేట్ రూ.739 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ 73,900కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట రూ.688 ఉండగా… కేజీ వెండి రూ.68,800గా ఉంది.
నిన్న అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర తగ్గింది. ఔన్స్ కు 0.04 శాతం క్షీణించి 25.83 డాలర్లకు తగ్గింద. కానీ బంగారం ధర మాత్రం పెరిగింది. ఔన్స్‌కు 0.01 శాతం పెరుగుదలతో 1778 డాలర్లకు చేరింది.
Also Read: Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..
SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..
మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్మెంట్కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే..