Petrol Diesel Price: దేశంలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలా.. మీ నగరంలో..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. అయితే మెట్రో నగరాల్లో ధరలు నిలకడగా ఉండగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

Petrol Diesel Price: దేశంలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలా.. మీ నగరంలో..
Petrol Price
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 16, 2021 | 8:54 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. అయితే మెట్రో నగరాల్లో ధరలు నిలకడగా ఉండగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా పెంచలేదు. గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.80గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.53గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.84గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.27గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.68గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.80గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.20గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.27 ఉండగా.. డీజిల్ ధర రూ.96.70గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.90 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.80 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.79 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.72 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.61లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.55గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.97గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.94గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.90 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.80లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.71 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.12ఉండగా.. డీజిల్ ధర రూ.93.36గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.04 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.08 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.82గా ఉంది.

ఇవికూడా చదవండి: Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..

Gujarat New Cabinet: మంత్రివర్గ కొత్త కూర్పుపై ప్రధాని మోడీ, అమిత్‌షా మార్క్‌.. 27 మందితో గుజరాత్‌లో కొత్త కేబినెట్‌..