Petrol Diesel Price: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. మున్ముందు మరింతగా పెరిగే అవకాశం..!

Petrol Diesel Price: గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. ఇలా స్థిరంగా..

Petrol Diesel Price: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. మున్ముందు మరింతగా పెరిగే అవకాశం..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 25, 2022 | 8:37 AM

Petrol Diesel Price: గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. ఇలా స్థిరంగా కొనసాగుతుండటంతో వాహనదారులకు ఊరట కలిగిస్తుందనే చెప్పాలి. ఇక రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తత (Russia Ukraine war)ల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ (Petrol, Diesel)ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు చమురు(Crude Oil) ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధరలకు 100 డాలర్లకు చేరుకుంది.

ఇక హైదరాబాద్‌ (Hyderabad)లో శుక్రవారం పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.20 ఉండగా, డీజిల్‌ కూడా అదే దారిలో ఉంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.62 వద్ద నిలకడగా కొనసాగుతోంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.98 ఉండగా, రూ.97గా ఉంది. ఇక కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.57 ఉండగా, డీజిల్ ధర రూ.94.95గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రలో ధర రూ.95.41 ఉండగా, డీజిల్‌ ధర రూ.86.67 ఉంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.14 ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.91.43 ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.67 ఉండగా, డీజిల్‌ ధర రూ.89.79 ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100.58 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.01 వద్ద కొనసాగుతోంది.

ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌ నుంచి 9224992249 నెంబర్‌కు SMS పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పపితే ధరల వివరాలు వస్తాయి.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు.. వీటి ధరలు మరింత ప్రియం..!

Gold Silver Price: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు