AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warren Buffett Guide: కాబోయే కోటీశ్వరులు తెలుసుకోవల్సినవి ఇవి.. రిచ్ వారెన్ బఫెట్ చెప్పిన సూత్రాలు మీకోసం..

వారెన్ బఫెట్ తరచుగా డబ్బుతో ఎలా ప్రవర్తించాలి. డబ్బు ఎంత ముఖ్యమైనది. డబ్బును పొదుపు చేయడం ఎంత ముఖ్యమైనది. డబ్బు సంపాదించడానికి ఏం చేయాలి..ఇలాంటి వాటిపై తరచు సలహాలు ఇస్తుంటారు. ఆయన చేసిన సలహాలో కొన్ని ఇక్కడ తెలుసుకుందాం.

Warren Buffett Guide: కాబోయే కోటీశ్వరులు తెలుసుకోవల్సినవి ఇవి.. రిచ్ వారెన్ బఫెట్ చెప్పిన సూత్రాలు మీకోసం..
Warren Buffett
Sanjay Kasula
|

Updated on: May 19, 2023 | 12:03 PM

Share

వారెన్ ఎడ్వర్డ్ బఫ్ఫెట్ ప్రపంచంలోని గొప్ప పెట్టుబడిదారులలో ఒకరు. ఒక అమెరికన్ బిజినెస్ మాగ్నెట్.ఐదుగురు ప్రపంచ దనవంతులలో ఒకరు. 8.5 లక్షల కోట్ల సంపదకు యజమాని. అతని పెట్టుబడులు చాలా విజయవంతమయ్యాయి. దీంతో పాటు ఎన్నో మానవతా కార్యక్రమాలు చేపట్టారు.. పరోపకారి అని కూడా చెప్పవచ్చు. 33 సంవత్సరాలకే మిలియనీరుగా మారడమే కాదు.. 55 సంవత్సరాలకు బిలియనీరుగా కూడా ఎదిగి ప్రపంచ కుబేరులలోఒకరైన వారెన్ ఎడ్వర్డ్ బఫ్ఫెట్ స్టాక్ మార్కెట్ కింగ్ మాత్రమే కాదు. తన ప్రసంగాల ద్వారా కొన్ని లక్షల మంది యువకులను ప్రభావితం చేసిన గొప్ప ఆర్ధిక నిపుణుడు.

అతను తరచూ యువతకు మార్గనిర్దేశం చేస్తుంటారు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎలా ప్రవర్తించాలి.. డబ్బు ఎంత ముఖ్యమైనది. డబ్బు ఆదా చేయడం ఎంత ముఖ్యం. డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి మొదలైన విషయాలపై ఆయన ప్రసంగాలు కొనసాగుతుంటాయి. అలాంటి కొన్ని సూక్తులు ఇక్కడ మనం ఇవాళ తెలుసకుందాం. ఆయన చెప్పిన కొన్ని సలహాలు మన జీవింతం పూల బాటలో పయనించేందుకు సహాయ పడుతాయి. ఇది మనలో చాలా మందకి ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా చదవండి..

వారెన్ బఫ్ఫెట్ సలహా 1: ఎప్పుడూ డబ్బు పోగొట్టుకోకండి

ఈ రెండు నియమాలను తెలుసుకోండి. నంబర్ వన్, ఎప్పుడూ డబ్బు పోగొట్టుకోకండి. రెండవది, మొదటి నియమాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. వారెన్ బఫెట్ తనదైన శైలిలో ఇచ్చిన ముఖ్యమైన సలహా ఇది. ఇది ఎంత సులభం కాదా? మనకు వచ్చిన డబ్బును వదులుకుంటే లక్ష్మి మన నుంచి వెళ్లిపోతుందని పెద్దలు చెప్పేది 100కు వంద శాతం నిజం.

వారెన్ బఫ్ఫెట్ సలహా 2: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి సూత్రం

వారెన్ బఫెట్ తన స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. అతని అంచనాల ప్రకారం, చాలా తక్కువ ధరల ఇండెక్స్ ఫండ్లలో భారీగా పెట్టుబడి పెట్టడం సరైన పెట్టుబడి పద్ధతి. స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్ల శాతం. తక్కువ-ధర S&P 500 ఇండెక్స్ ఫండ్‌లో 10 శాతం. 90 % డబ్బు పెట్టండి’ అని వారెన్ బఫెట్ 2013 లో చెప్పారు

వారెన్ బఫ్ఫెట్ సలహా 3: అప్పుల్లో కూరుకుపోకండి

మన పెద్దలు అప్పును ముల్లుతో పోలుస్తారు. వారెన్ బఫెట్ కూడా అదే చెప్పారు. మీరు ఈ లోకంలో దేనికీ రుణపడి ఉండరు. తెలివితేటలుంటే అప్పులు తప్పవని, బోలెడు డబ్బు సంపాదిస్తారని నమ్ముతారు. క్రెడిట్ కార్డుల విషయంలో యువత చాలా జాగ్రత్తగా ఉండాలని వారెన్ బఫెట్ సలహా ఇస్తున్నారు.

వారెన్ బఫ్ఫెట్ సలహా 4: చేతిలో నగదు ఉంచుకోండి

ఎవరైనా ఈ మొత్తాన్ని ఎప్పుడైనా సిద్ధంగా ఉంచుకోవాలి. నగదు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. వారెన్ బఫెట్ మీకు ఎప్పుడు బిల్లు చెల్లించాల్సి వస్తుందో మీకు ఎప్పటికీ తెలియదని సలహా ఇస్తారు. కానీ, డబ్బు జేబులో పెట్టుకోనవసరం లేదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్, UPI యుగం కారణంగా ఖాతాలో డబ్బు ఉంచుకోవాలని అంటారు వారెన్ బఫ్ఫెట్.

వారెన్ బఫ్ఫెట్ సలహా 5: తక్కువ ధరకే ఎక్కువ విలువను పొందండి

‘మీరు ఇచ్చేది డబ్బు, మీ విలువ పెంచుతుంది’ – ఇది 2008 లో వారెన్ బఫెట్ చెప్పిన మరో తెలివైన మాట . అంటే , ఒక వస్తువుని దాని విలువ కంటే ఎక్కువ పెట్టి కొనకండి. ధర తగ్గినప్పుడు నాణ్యమైన స్టాక్‌లను కొనుగోలు చేస్తానని వారెన్ బఫెట్ చెప్పారు.

వారెన్ బఫ్ఫెట్ సలహా 6: మీపై మీరు పెట్టుబడి పెట్టండి

మీకు ఉన్న గొప్ప ఆస్తి మీరే. బఫెట్ నుంచి మరొక సలహా ఏంటంటే మీపై మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టండి. మీ ప్రస్తుత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం. కొత్త కోర్సు నేర్చుకోవచ్చు. పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. ఇలాంటివి చేస్తే 10 రెట్లు లాభం అన్నది ఈ పెద్దాయన సూత్రం.

వారెన్ బఫ్ఫెట్ సలహా 7: దీర్ఘకాలం ఆలోచించండి

పెట్టుబడి పెట్టగానే లాభపడాలనే ఆలోచనను వదిలేయండి. దీర్ఘకాలానికి డబ్బు గురించి ఆలోచించండి. మీ పెట్టుబడి దీర్ఘకాలికంగా ఉండనివ్వండి. మార్కెట్ పడిపోతున్నప్పడు పెట్టుబడిని వెనక్కి తీసుకునే పని అస్సలు చేయకండి. ఇది మీకు ఎప్పటికీ ఆర్థిక భద్రతను కలిగిస్తుందని వారెన్ బఫెట్ చెప్పారు.

వారెన్ బఫ్ఫెట్ సలహా 8: సరస్సు నీటిని సరస్సులోకి పోయండి

మీరు ధనవంతులైతే ఆ శాతం.. మీరు వర్గం 1 కి చెందినవారు.. మిగిలిన శాతం 99 శాతం ప్రజల పట్ల మానవత్వం చూపండి. మీకు సంపద ఉంటే పేదలకు సహాయం చేయండి. హృదయ సంపన్నతను చూపండని వారెన్ బఫెట్ సలహా ఇచ్చారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం