Retirement Planning: ఇలా చేస్తే పదవీ విరమణ తర్వాత హ్యాపీ లైఫ్.. అద్భుతమైన పొదుపు మంత్రా.. మీ కోసం..
కానీ చాలా మంది తమ కెరీర్ ప్రారంభ సమయంలో పదవీ విరమణ ప్రణాళికను పట్టించుకోరు. అయితే ఆర్జిస్తున్న సమయంలో కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
జీవితంలో ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. రాబడులు, ఖర్చులు, పొదుపు మార్గాలు, పెట్టుబడి పథకాలపై కనీసం అవగాహన అవసరం. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలం. కానీ చాలా మంది తమ కెరీర్ ప్రారంభ సమయంలో పదవీ విరమణ ప్రణాళికను పట్టించుకోరు. అయితే ఆర్జిస్తున్న సమయంలో కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ముందుగా పొదుపు ప్రారంభించకపోతే..
నెలవారీ సంపాదన బాగున్నప్పుడే పొదుపు ప్రారంభించాలి. కానీ చాలా మంది ఇప్పుడే ఎందుకులే, ఇంకా సమయం ఉందిలే అనుకుంటుంటారు. కానీ అది నష్టదాయకమని నిపుణులు చెబుతున్నారు. ఓ ఉదాహరణ ద్వారా దానిని వివరిస్తున్నారు. ఒక వ్యక్తి 25 ఏళ్ల వయస్సులో నెలకు రూ. 10,000 చొప్పున పొదుపు చేయడం ప్రారంభించారనుకుంటే.. 7 శాతం వార్షిక వడ్డీతో ఆ వ్యక్తి 60 ఏళ్లు వచ్చే సమయానికి మీ ఖాతాలో రూ.45 మిలియన్లు ఉంటాయి. అదే వ్యక్తి 35 ఏళ్ల వరకు వేచి ఉండి.. అప్పుడు పొదుపు ప్రారంభిస్తే.. అదే మొత్తానికి 60 ఏళ్ల వయస్సుకు వచ్చే సరికి రూ.18 మిలియన్లు మాత్రమే ఉంటాయి. కేవలం పదేళ్ల గ్యాప్‌తోనే రెండింతల ఆదాయాన్ని కోల్పోయినట్లు అవుతుందని వివరిస్తున్నారు. అందుకే వీలైనంత ముందుగానే పొదుపు పథకాలను ప్రారంభించాలి.
పన్ను రాయితీలను వినియోగించుకోండి..
ప్రభుత్వ పొదుపు పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వంటి వివిధ పన్ను ఆదా చేసుకొనే పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి పదవీ విరమణ సమయానికి ఉపయుక్తంగా ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్..
దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించే వారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి ఇతర సంప్రదాయ పెట్టుబడి పథకాలతో పోలిస్తే అవి అధిక రాబడిని అందిస్తాయి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం రిస్క్‌తోకూడుకున్నవి. రాబడికి హామీ ఉండదు.
అత్యవసర ఖర్చుల కోసం..
మీ రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడంతో పాటు, భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఊహించని ఖర్చుల కోసం ప్లాన్ చేయడం ముఖ్యం. ఇందులో వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర ఊహించని సంఘటనలు ఉంటాయి. ఈ ఆకస్మిక పరిస్థితుల కోసం మీ పొదుపులో కొంత భాగాన్ని పక్కన పెట్టడం ద్వారా, మీ పదవీవిరమణ కోసం దాచుకునే డబ్బుని మధ్యలో తీయకుండానే అత్యవసర ఖర్చులు నిర్వహించుకునే వీలుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..