Cibil Score: సిబిల్ స్కోర్ తగ్గడానికి మీరు చేసే ఈ 5 తప్పులే కారణం.. ఇలా చేస్తే ఇక నో టెన్షన్..
లోన్ లేదా క్రెడిట్ కార్డు ఏది కావాలన్నా బ్యాంకులు ప్రధానంగా చూసేది సిబిల్ స్కోర్.. అవును సిబిల్ బాగుంటేనే మీకు లోన్స్, కార్డులు ఇవ్వడానికి ముందుకొస్తాయి. స్కోర్ తక్కువగా ఉంటే లోన్ దొరకడం కష్టం. అయితే కేవలం 5 ఈజీ టిప్స్ పాటిస్తే మీ స్కోర్ పెరుగుతుంది.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సిబిల్ స్కోర్ అనేది ఒక రకంగా మీ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుగా చెక్ చేసేది ఈ స్కోర్‌నే. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ రావడం కష్టమవుతుంది. ఒకవేళ ఇచ్చినా అధిక వడ్డీ రేటు కట్టాల్సి రావచ్చు. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
మంచి సిబిల్ స్కోర్ అంటే ఎంత..?
సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుండి 900 వరకు ఉంటుంది.
750 కంటే ఎక్కువ: ఇది బ్యాంకులు చాలా మంచి స్కోర్‌గా పరిగణిస్తాయి. లోన్ త్వరగా, తక్కువ వడ్డీకే లభించే అవకాశం ఉంటుంది.
650 కంటే తక్కువ: బ్యాంకులు మిమ్మల్ని రిస్క్ కస్టమర్‌గా పరిగణించే అవకాశం ఉంది.
సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి 5 ముఖ్య మార్గాలు
టైమ్ టు టైమ్ : మీరు తీసుకున్న లోన్స్ లేదా ఈఎంఐలు సకాలంలో తిరిగి చెల్లించకపోతే, అది మీ సిబిల్ స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీరు ఆలస్యం చేస్తే ఫైనతో పాటు మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఈఎంఐని క్రెడిట్ కార్డు బకాయిని గడువు తేదీలోగా చెల్లించాలి.
సెక్యూర్డ్ – అన్‌సెక్యూర్డ్ లోన్స్: మీకు సెక్యూర్డ్ లోన్స్, అన్‌సెక్యూర్డ్ లోన్స్ మధ్య మంచి బ్యాలెన్స్ ఉండాలి. మీరు అధిక సంఖ్యలో అన్‌సెక్యూర్డ్ రుణాలు కలిగి ఉంటే, అవి మీ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీలైనంత త్వరగా వాటిని చెల్లించి క్రెడిట్ బ్యాలెన్స్‌ను మెరుగుపరుచుకోండి.
క్రెడిట్ కార్డును తెలివిగా వాడడం: క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నట్లయితే.. ప్రతి నెలా బకాయి ఉన్న మొత్తాన్ని గడువు తేదీలోగా పూర్తిగా చెల్లించండి. ఇది మీ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది. క్రెడిట్ లిమిట్‌లో తక్కువ మొత్తాన్ని మాత్రమే ఉపయోగించడం మంచి అలవాటు.
హామీదారుగా ఉండకండి: వేరేవారి లోన్‌కి గ్యారెంటర్‌గా ఉండకండి. మీరు ఎవరికైనా హామీదారుగా మారినప్పుడు ఆ వ్యక్తి రుణం చెల్లించకపోతే, ఆ ప్రభావం నేరుగా మీ CIBIL స్కోర్‌పై పడుతుంది.
పాత రుణాలు క్లియర్: మీరు రెండవ రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, కొత్త లోన్ తీసుకునే ముందు మునుపటి రుణాన్ని పూర్తిగా క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను బలోపేతం చేసి స్కోర్‌ను మెరుగుపరుస్తుంది.
మెరుగైన సిబిల్ స్కోర్ అంటే బ్యాంకుల దృష్టిలో మీరు నమ్మకమైన కస్టమర్ అని అర్థం. సరైన ఆర్థిక ప్రణాళికతో, క్రమశిక్షణతో ఈ చిట్కాలను పాటిస్తే, మీ క్రెడిట్ స్కోర్‌ను సులభంగా పెంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




