AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: యాప్ లోన్ vs బ్యాంక్ లోన్.. ఏది బెస్ట్? ఇలా తేల్చుకోండి!

యాప్ ద్వారా లోన్స్ లేదా అప్పులు ఇచ్చే చిన్న చిన్న ఫిన్‌టెక్ సంస్థలు ఇప్పుడు బాగా పెరిగాయి. అయితే మొబైల్ నెంబర్ లేదా ఆధార్, పాన్ కార్డు నెంబర్లతో సులభంగా లభించే ఈ లోన్స్‌ చాలా వేగంగా అప్రూవ్ అవుతుంటాయి. అందుకే చాలామంది వీటిని తీసుకుంటుంటారు. అయితే ఈ లోన్ బెస్టా? లేదా బ్యాంక్ లోన్ బెస్టా? అన్న సందేహం వచ్చినప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి.

Personal Loan: యాప్ లోన్ vs బ్యాంక్ లోన్.. ఏది బెస్ట్? ఇలా తేల్చుకోండి!
Loan Apps Vs Banks
Nikhil
|

Updated on: Oct 12, 2025 | 6:09 PM

Share

లోన్ తీసుకోవడానికి ప్రస్తుతం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాంకుల్లో వివిధ అవసరాలకు తగ్గట్టు రకరకాల లోన్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే లోన్ యాప్స్ ద్వారా లోన్స్ లభిస్తుంటాయి. వీటితోపాటు గోల్డ్ లోన్, మోర్టగేజ్ లోన్.. ఇలా చాలా ఆప్షన్లు. అయితే వీటిలో యాప్ ద్వారా లభించే లోన్ కు బ్యాంకు ఇచ్చే లోన్ కు మెయిన్ గా ఉండే డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాంకులు బెస్ట్

సరైన ఆదాయం, బ్యాంక్ హిస్టరీ ఉన్నవాళ్లకు బ్యాంకులే రుణాలిస్తాయి. కాబట్టి ఎప్పుడైనా లోన్ అవసరం అయినప్పుడు ఒకసారి బ్యాంకులను సంప్రదించడం మందిచి. బ్యాంకుల్లో అయితే తక్కువ వడ్డీ, తగిన వెసులుబాట్లతో రుణం లభిస్తుంది. బ్యాంకులో లోన్ తీసుకుని నిర్ణీత సమయంలో తిరిగి కట్టేయడం ద్వారా క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇది మరోసారి లోన్ తీసుకునేందుకు హెల్ప్ అవుతుంది. బ్యాంకులు కొన్ని నియమ నిబంధనలను పాటిస్తాయి. కాబట్టి బ్యాంక్ లోన్ అనేది ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్.

లోన్ యాప్స్ ఎప్పుడంటే..

బ్యాంకులు లోన్ ఇవ్వనప్పుడు అత్యవసరమైన పరిస్థితుల్లో లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకోక తప్పదు. అయితే యాప్ ద్వారా లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ సంస్థ ఆర్‌బీఐ అనుమతి ఉన్న సంస్థ అవునా? కాదా? అన్న విషయం తెలుసుకోవాలి. పర్మిషన్ లేని సంస్థలపై ఆర్‌‌బీఐ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా కొన్ని యాప్స్ చట్ట విరుద్ధంగా లోన్స్ ఇస్తుంటాయి. లోన్ ఇచ్చిన తర్వాత తిరిగి చెల్లించే వరకూ అనేక రకాలుగా ఇబ్బంది పెడతుంటాయి. అందుకే ఆర్‌‌బీఐ రిజిస్టర్డ్ సంస్థల ద్వారానే లోన్స్ తీసుకోవాలి.  ఆర్‌బీఐ గుర్తించని సంస్థల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు తీసుకోవద్దు.

ప్రైవసీ ముఖ్యం

లోన్స్ తీసుకునేముందు తగిన డాక్యుమెంట్ల రూపంలో వ్యక్తిగత వివరాలు అందిచాల్సి ఉంటుంది. యాప్స్ ద్వారా డిజిటల్ లోన్ తీసుకునేటప్పుడు అవసరమైన వివరాలు మాత్రమే అందించాలి. పర్సనల్ డేటా థర్డ్ పార్టీ సంస్థలకు ఇస్తున్నారేమో చెక్ చేసుకోవాలి. ఆర్‌‌బీఐ రిజిస్టర్ అయిన సంస్థలతో అయితే ఇలాంటి సమస్యలు ఉండవు. అలాగే ఆన్‌లైన్‌లో లోన్ అప్లై చేసినప్పుడు వడ్డీ రేట్లు, లేట్ ఛార్జీల వంటివి ముందే తెలుసుకోవాలి. ఈ వివరాలన్ని ఆయా సంస్థల వెబ్‌సైట్లలో లభిస్తాయి.

ఏదేమైనా డిజిటల్‌లోన్స్ ఈజీగా లభిస్తాయి కదా అని అవసరం లేకపోయినా అప్పు చేయడం మంచిది కాదు. అవసరం ఉండి, తిరిగి చెల్లించేందుకు తగిన మార్గాలు ఉంటేనే లోన్స్ తీసుకోవాలి. అలాగే తీసుకున్న అప్పు లేదా ఈఎంఐలు నిర్ణీత కాలంలో కట్టేస్తూ ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా