AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm Payments Bank: పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఆ సేవల గడువు పొడిగింపు

క్రెడిట్ లావాదేవీలు, ప్రీపెయిడ్ సేవలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లను ఈ ఏడాది మార్చి 15వరకు నిర్వహించే అవకాశం కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలు వాడుతున్న వినియోగదారుల సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం మరికొత సమయం ఇవ్వాలని ఆర్‌బీఐ భావించింది. అయితే నిర్దేశించిన గడువులోగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నోడల్ ఖాతాల్లోని అన్ని ఆన్‌లైన్‌ లావాదేవీల సెటిల్‌మెంట్లను

Paytm Payments Bank: పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఆ సేవల గడువు పొడిగింపు
Paytm
Subhash Goud
|

Updated on: Feb 17, 2024 | 6:27 AM

Share

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీస్‌ గడువును భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ గడువు ఈనెల 29వ తేదీ వరకు ఉండగా, మార్చి 15కి పొడిగించింది. కస్టమర్ డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, ప్రీపెయిడ్ సేవలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లను ఈ ఏడాది మార్చి 15వరకు నిర్వహించే అవకాశం కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలు వాడుతున్న వినియోగదారుల సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం మరికొత సమయం ఇవ్వాలని ఆర్‌బీఐ భావించింది. అయితే నిర్దేశించిన గడువులోగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నోడల్ ఖాతాల్లోని అన్ని ఆన్‌లైన్‌ లావాదేవీల సెటిల్‌మెంట్లను పూర్తి చేయాలని సూచించింది. గడువు తర్వాత ఎలాంటి లావాదేవీలకు అనుమతి ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ద్వారా ఫ్రీజ్ చేసిన ఖాతాలు మినహా అన్నిటిలో బ్యాలెన్స్ విత్‌డ్రా ప్రక్రియను సులభతరం చేయాలని కంపెనీని ఆర్బీఐ ఆదేశించింది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆటోమెటిక్ ‘స్వీప్-ఇన్, స్వీప్ ఔట్’ సదుపాయం కింద పార్ట్‌నర్ బ్యాంకులతో కస్టమర్లకు సజావుగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది.

పేటీఎం బ్యాంకును ఆర్‌బీఐ ఎందుకు నిషేధిస్తోంది?

ఇవి కూడా చదవండి

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిషేధం ఆకస్మిక నిర్ణయం కాదు. పేమెంట్స్ బ్యాంకుకు చెందిన కొన్ని ఖాతాల మధ్య అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా తెరిచేటప్పుడు కేవైసీ నియమాలు సరిగ్గా పాటించలేదని ఆర్బీఐ గుర్తించింది. అందువల్ల, లావాదేవీని గుర్తించడం కష్టం అవుతుంది. దీనిపై పలుమార్లు పేటీఎం బ్యాంకును ఆర్బీఐ హెచ్చరించింది. అయితే, పేటీఎం దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. చివరి ప్రయత్నంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపైనే ఆర్బీఐ ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..