AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: పాన్ కార్డు ఉన్న వారికి అలెర్ట్.. ఇలా చేస్తే రూ.10000 ఫైన్ నుంచి మీరు సేఫ్..!

పాన్ కార్డు అనేది ఓ వ్యక్తి లేదా కంపెనీ పన్ను బాధ్యతను అంచనా వేయడంలో అవసరమైన అన్ని ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడంలో ఆదాయపు పన్ను అథారిటీకి సహాయపడుతుంది.

Pan Card: పాన్ కార్డు ఉన్న వారికి అలెర్ట్.. ఇలా చేస్తే రూ.10000 ఫైన్ నుంచి మీరు సేఫ్..!
Pan Card
Nikhil
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 30, 2023 | 9:26 PM

Share

పాన్ కార్డ్..ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు చేసే వారికి కచ్చితంగా ఉండాల్సిన ప్రభుత్వ గుర్తింపు కార్డు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తుంది. ఇప్పుడు బ్యాంకు ఖాతా తీసుకోవాలంటే కచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే. పాన్ కార్డు అనేది ఓ వ్యక్తి లేదా కంపెనీ పన్ను బాధ్యతను అంచనా వేయడంలో అవసరమైన అన్ని ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడంలో ఆదాయపు పన్ను అథారిటీకి సహాయపడుతుంది. ఇది పన్ను ఎగవేత అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే పాన్ కార్డు విషయంలో మన నిర్లక్ష్యమే కష్టాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఓ సాధారణ పౌరుడికి రెండు పాన్ కార్డులు ఉండడం నేరమని తెలుసా? ఈ నేరానికి రూ.10000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మీకు నిజంగా రెండు పాన్ కార్డులు ఉంటే వాటిని ప్రభుత్వానికి ఫైన్ కట్టకుండా సరెండర్ చేసే విధానాన్ని ఓ సారి చూద్దాం.

సమాచారాన్ని 10 అంకెలను జాగ్రత్తగా పూరించాలని వినియోగదారులకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. ఓ వ్యక్తికి తప్పనిసరిగా ఓ పాన్ కార్డు మాత్రమే ఉండాలి. రెండు పాన్ కార్డులు ఉంటే కచ్చితంగా రూ.10 వేలు ఫైన్ కట్టాలని చెబుతున్నారు. అలాగే పాన్ కార్డు రద్దు చట్టపరమైన శిక్షను వేసే అధికారం ఉంటుంది. సో రెండు పాన్ కార్డులు ఉంటే కచ్చితంగా ప్రభుత్వానికి అప్పగించాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే చట్టపరమైన శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. రెండు పాన్ కార్డులు ఉన్న వారు పాన్ కార్డు ఎలా అప్పగించాలో ఓ సారి చూద్దాం.

  1. ముందుగా ఐటీ శాఖ వెబ్ సైట్ సందర్శించాలి.
  2. కొత్త పాన్ కార్డు/కరెక్షన్ కోసం లింక్ ను క్లిక్ చేయాలి. 
  3. అక్కడ డిస్ ప్లే అయ్యే ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
  4. దాంట్లో తగిన వివరాలను పూరించి, ఏదైనా ఎన్ఎస్ డీఎల్ కార్యాలయంలో సమర్పించాలి. 

పాన్ కార్డ్ పొందడానికి సులభమైన మార్గం ఇదే

ఇవి కూడా చదవండి
  • పాన్ కార్డ్ పొందడానికి మీరు ఆదాయపు పన్ను శాఖ యొక్క ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు ‘ఇన్‌స్టంట్ పాన్ త్రూ ఆధార్’పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ‘గెట్ న్యూ పాన్’పై క్లిక్ చేయండి. దీని తర్వాత, మీరు ఆధార్ నంబర్‌ను నమోదు చేయమని అడగబడతారు. అప్పుడు వివరాలు నింపాల్సి ఉంటుంది.
  • మీరు ఆధార్‌ను నమోదు చేసిన వెంటనే, మీ ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపబడుతుంది.
  • ఓటీపీని నమోదు చేసిన తర్వాత, మీ ఈ-పాన్ జనరేట్ అవుతుంది. మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • తక్షణ పాన్ కార్డ్ తయారు చేస్తున్నప్పుడు, మీరు ఎలాంటి ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని వివరాలు మీ ఆధార్ నుండే తీసుకోబడతాయి.
  • మీరు తయారు చేసిన పాన్‌ కార్డ్ తక్షణమే ఈ-పాన్ కార్డ్‌గా మిగిలిపోయింది. కానీ మీకు కావాలంటే మీరు ఈ పాన్ కార్డ్ ను తర్వాత భౌతిక కార్డ్‌గా మార్చుకోవచ్చు.
  • మీరు భౌతిక కార్డు కోసం రుసుము చెల్లించాలి.
  • దీని తర్వాత మీ ఇంటి చిరునామా నుండి పాన్ కార్డ్ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం