AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: కేవలం రూ.5 వేల పెట్టుబడితో సొంత వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు.. కేంద్రం అద్భుత అవకాశం

Jan Aushadhi Center: వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. వీటి ద్వారా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం రుణాలు కూడా ఇస్తోంది. కేవలం రూ.5 వేల పెట్టుబడితో మీరు కేంద్రం ప్రభుత్వ సహాయంతో వ్యాపారం పెట్టవచ్చు.

Business Idea: కేవలం రూ.5 వేల పెట్టుబడితో సొంత వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు.. కేంద్రం అద్భుత అవకాశం
Business Idea
Venkatrao Lella
|

Updated on: Dec 10, 2025 | 4:41 PM

Share

నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలు అమల్లోకి తెచ్చింది. వారికి వివిధ కోర్సుల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించడంతో పాటు వ్యాపారం చేయాలనుకునే యువతకు వడ్డీ లేని రుణాలు వంటి సదుపాయాలు కల్పిస్తోంది. తక్కువ పెట్టుడితే వ్యాపారం చేయాలనువారికి ప్రభుత్వం నుంచి అనేక అవకాశాలు కల్పిస్తోంది. అందులో భాగంగానే వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికుల కోసం రూ.5 వేల పెట్టుబడితో ఒక గొప్ప కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది మోదీ ప్రభుత్వం. అదే మెడికల్ షాపు బిజినెస్. జన ఔషధీ కేంద్రాల పేరుతో జనరిక్ మెడికల్ షాపులను కేంద్రం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మీరు కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ మెడికల్ షాపు ఏర్పాటు చేసుకుని డబ్బులు సంపాదించోచ్చు.. ఎలానో చూద్దాం.

ఏవేం కలిగి ఉండాలి

120 చదరపు అడుగులు స్థలం కలిగి ఉండాలి. డి ఫార్మాసి లేదా బీ ఫార్మసీ చదివి ఉండాలి. ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.5 వేలు ఉంటుంది. వీటిని చెల్లించి పూర్తి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అనుమతి మంజూరు చేస్తారు.

ఈ పత్రాలు తప్పనిసరి

ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సమర్పించాలి. మీరు ఈ కేంద్రాలను పెట్టుకోవడానికి ఆన్‌లైన్‌లో సులువుగా అప్లై చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే janaushadhi.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లండి మెయిన్ ట్యా్బ్‌లో అప్లై ఫర్ కేంద్ర అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. రిజిస్టర్ నౌ ఆప్షన్‌పై క్లిక్ చేసి డిటైల్స్ నింపండి. ఆ తర్వాత సమ్మిట్ చేయండి.

ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు

మీరు ఈ మెడికల్ షాపుల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. నెలకు రూ.5 లక్షలపై మందులు కొనుగోలు చేస్తే 15 శాతం ప్రోత్సాహకం ఇస్తోంది. ఇక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.2 లక్షల వరకు ప్రోత్సాహకం ఇచ్చే అవకాశం కూడా ఉంది.