Tollywood: యూట్యూబ్ నుంచి నెలకు రూ.30 లక్షల ఆదాయం కొల్లగొట్టిన నటీమణి..
యూట్యూబ్ నుంచి లక్షలు సొమ్ము కొల్లగొట్టడం సాధ్యమేనా..? రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో నార్మల్ కంటెంట్ అప్ డేట్ చేస్తూ ఓ పెద్ద కంపెనీ ప్రాఫిట్స్ రేంజ్‌లో మనీ సంపాదించడం కుదురుతుందా అంటే.. అవుననే అంటున్నారు నటి శ్రీవాణి దంపతులు. ఆ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం...

ప్రముఖ సీరియల్ నటి శ్రీవాణి, ఆమె భర్త విక్రమ్ తమ యూట్యూబ్ ఛానెల్ ఆదాయం గురించి, తమ ఫైనాన్సియల్ సిట్యువేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో తమ గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను వారు ఈ సందర్భంగా వారు క్లియర్ చేశారు. ఇంటర్వ్యూయర్ వారి విల్లాలు, లగ్జరీ కార్ల గురించి అడగగా.. శ్రీవాణి, విక్రమ్ నవ్వుతూ తాము ఇంకా విల్లాలు కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో విల్లా కొనుక్కోవాలనే కోరిక ఉందని, అందుకు అభిమానుల ప్రోత్సాహం అవసరమని తెలిపారు. తమకు బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లు లేవని, కేవలం మారుతి సుజుకి బ్రాండ్‌కు చెందిన రెండు కార్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. అందులో ఒకటి కొత్త మోడల్ గ్రాండ్ విటారా అని, అది చూసేవాళ్లకు లగ్జరీ కారుగా అనిపించవచ్చని చెప్పారు. గ్రాండ్ విటారాను కూడా తాము లోన్‌పైనే కొనుగోలు చేశామని, షాప్ ఓపెనింగ్స్ వంటి ఈవెంట్లకు వెళ్లినప్పుడు ప్రత్యేక వాహనాలు బుక్ చేయాల్సిన అవసరం లేకుండా, తమ వాహనంలోనే వెళ్లడానికి వీలుగా కొనుగోలు చేశామని పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు మారుతి సుజుకి కార్లు మెయింటెనెన్స్ పరంగా సులువని వారు అభిప్రాయపడ్డారు.
ఇటీవలి కాలంలో యూట్యూబర్లు తమ ఆదాయాన్ని ఓపెన్‌గా చెబుతున్న నేపథ్యంలో.. శ్రీవాణి, విక్రమ్‌లను వారి యూట్యూబ్ ఆదాయం గురించి ప్రశ్నించారు. తాము తమ ఆదాయ వివరాలను బయటకు చూపించలేదని, అయితే ఇతరులు తమ ఆదాయాన్ని అంచనా వేస్తూ చాలా వీడియోలు చేయడం తమకు ఆశ్చర్యం కలిగించిందని శ్రీవాణి పేర్కొన్నారు. ఈ వీడియోలలో తమ ఛానెల్ వ్యూస్ ఆధారంగా పెద్ద పెద్ద లెక్కలు వేసి ఆదాయాన్ని అంచనా వేశారని, తాము స్వయంగా అలాంటి లెక్కలు వేసుకోలేదని ఆమె తెలిపారు. తమకు డబ్బు వచ్చినప్పుడు సంతోషిస్తామని, నిరాడంబరంగా జీవిస్తామని వారు చెప్పారు. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానెల్ నెలకు 30 లక్షల నుంచి 60 లక్షల వరకు సంపాదిస్తుందని, ఆ ఛానెల్ వ్యూయర్షిప్ మీతో సమానంగా ఉంది కాబట్టి.. మీకు కూడా అంతే ఆదాయం వచ్చిందా అని ఇంటర్వ్యూయర్ అడిగారు. దీనికి శ్రీవాణి స్పందిస్తూ, కొన్ని సందర్భాలలో నెలకు 30 లక్షల వరకు ఆదాయం వచ్చిన సందర్భాలు ఉన్నాయని కన్ఫామ్ చేశారు. తమ కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్ జరిగిన నెలలో, అలాగే తమ గృహప్రవేశం జరిగిన నెలలో ఈ స్థాయి ఆదాయం వచ్చిందని ఆమె వివరించారు. ఈ ఆదాయం కేవలం యూట్యూబ్ వ్యూస్ ద్వారానే కాకుండా, కొలాబరేషన్స్ ద్వారా కూడా వచ్చిందని స్పష్టం చేశారు. అయితే, ప్రతి వీడియోకు కొలాబరేషన్స్ చేయమని వారు తెలిపారు. ఈ అధిక ఆదాయంతోనే తాము కొత్త ఇంటికి అడ్వాన్స్ కట్టి ఇంటిని తీసుకున్నామని వారు వెల్లడించారు. ఇది తమ యూట్యూబ్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని వారు వెల్లడించారు.
View this post on Instagram
Also Read: తన రెండు కీడ్నీలు పాడవడానికి రీజన్ ఏంటో చెప్పిన పంచ్ ప్రసాద్..




