Ola Electric Bike:: త్వరలోనే స్టాక్ మార్కెట్‌లో ఓలా ప్రవేశం.. ఒక షేర్ ధర ఎంతో తెలుసా..?

భారతదేశంలోని ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా స్కూటర్లు తమ మార్క్‌ను చూపుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ విస్తరణలో భాగంగా ఐపీఓకు వెళ్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. వారి అంచనాలను నిజయం చేస్తూ ఓలా ఎలక్ట్రిక్ తన స్టాక్ మార్కెట్ అరంగేట్రానికి ముందు తన షేర్ల ధరలను వెల్లడించింది. ఓలా బ్రాండ్ తన షేర్ల ధరను రూ.72 నుంచి రూ.76 మధ్యలో ఉంచే అవకాశం ఉందని, మార్కెట్ నిపుణులు అంచనా వస్తున్నారు.

Ola Electric Bike:: త్వరలోనే స్టాక్ మార్కెట్‌లో ఓలా ప్రవేశం.. ఒక షేర్ ధర ఎంతో తెలుసా..?
Ola Electric
Follow us

|

Updated on: Jul 31, 2024 | 4:45 PM

భారతదేశంలోని ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా స్కూటర్లు తమ మార్క్‌ను చూపుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ విస్తరణలో భాగంగా ఐపీఓకు వెళ్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. వారి అంచనాలను నిజయం చేస్తూ ఓలా ఎలక్ట్రిక్ తన స్టాక్ మార్కెట్ అరంగేట్రానికి ముందు తన షేర్ల ధరలను వెల్లడించింది. ఓలా బ్రాండ్ తన షేర్ల ధరను రూ.72 నుంచి రూ.76 మధ్యలో ఉంచే అవకాశం ఉందని, మార్కెట్ నిపుణులు అంచనా వస్తున్నారు. ఓలా ఐపీఓ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 6 మధ్య సబ్ స్క్రిప్షన్ల కోసం అందుబాటులో ఉంటుంది. అయితే ఓలా ఐపీఓ భారతదేశంలో 2024లో అతి పెద్ద ఐపీఓల్లో ఒకటిగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓలా ఐపీఓ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఫిడిలిటీ, నోమురా, నార్జెస్ బ్యాంక్ అలాగే అనేక భారతీయ మ్యూచువల్ ఫండ్ల నుంచి పెట్టుబడిదారుల బిడ్లను తీసుకుంటుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓలో 5,500 కోట్ల వరకు తాజా షేర్ విక్రయాలతో పాటు దాని ప్రమోటర్లు మరియు ప్రస్తుత వాటాదారుల ద్వారా 645.56 కోట్ల విలువైన 8,49,41,997 షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు మార్కెట్ నుంచి నిధులను సేకరించేందుకు కొత్త షేర్లను జారీ చేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఓలా ఎలక్ట్రిక్ తన ఐపీఓలో 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయనుంది. ఓలా ఎలక్ట్రిక్ ఆర్అండ్‌డీలో భారీగా పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశ పెట్టడం ద్వారా కాకుండా EV డొమైన్లో బహుముఖ విధానాన్ని అనుసరించడం ద్వారా భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో అగ్రగామిగా నిలవాలని ఓలా లక్ష్యమని ఓలా ప్రతినిధులు చెబుతున్నారు. 

ఓలా కంపెనీ కొత్త సెల్ టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధిలో కూడా భారీగా పెట్టుబడి పెడుతోంది. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ 4680 బ్యాటరీ సెల్స్, సాలిడ్-స్టేట్ బ్యాటరీలతో పాటు సోడియం-అయాన్ బ్యాటరీల పై కూడా పనిచేస్తోంది. అందువల్ల ఐపీఓ ద్వారా వచ్చే ఫండ్స్ ఓలా పరిశోధన, అభివృద్ధి, మూలధన వ్యయాల కోసం ఉపయోగిస్తారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..