28 October 2024
Subhash
భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. పండగకు ముందు పసిడి ధరలు ఉపశమనం కలిగించాయి.
అక్టోబర్ 28వ తేదీన రాత్రి 7 గంటల సమయానికి బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. తులంపై ఏకంగా రూ.490 వరకు తగ్గింది.
ఈ సమయానికి దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,150 ఉంగడా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,800 వద్ద ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,950 ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,150 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 79,800 రూపాయల వద్ద నమోదైంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,300 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల 79,950 రూపాయలు ఉంది.
దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దీపావళి పండగ శోభ ముందే వచ్చింది.
పసిడి ధరలు తగ్గడంతో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మగువలు ఆసక్తి కనబరుస్తున్నారు. వెండి ధర కిలోకు రూ.98 వేలు ఉంది. హైదరాబాద్‌లో పాటు ఇతర ప్రాంతాల్లో లక్షా 7 వేలు ఉంది.