AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cab Charges Hike: పెరగనున్న క్యాబ్ చార్జీలు.. వినియోగదారులపై అదనపు భారం

Cab Charges Hike: ఈ మార్గదర్శకాలను మూడు నెలల్లోపు అమలు చేయాలని మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. కస్టమర్లపై అదనపు భారం పడకుండా, పోటీని తగ్గించకుండా సహేతుకమైన ఛార్జీలను నిర్ధారించడం దీని ఉద్దేశ్యం. ఇది కాకుండా డ్రైవర్ బుకింగ్‌ను అంగీకరించి ఎటువంటి..

Cab Charges Hike: పెరగనున్న క్యాబ్ చార్జీలు.. వినియోగదారులపై అదనపు భారం
Gopikrishna Meka
| Edited By: Subhash Goud|

Updated on: Jul 02, 2025 | 4:15 PM

Share

కాదేది సామాన్యుడి పై ఆర్థిక భారాలకు అనర్హం అన్నట్లు ఉన్నాయి పరిస్థితులు..ఒకప్పుడు విమానాలు..ఆ తరువాత రైళ్లు..ఇప్పుడు క్యాబ్ సర్వీసులు ఎంటా అనుకుంటున్నారా అదే డైనమిక్ ప్రైసింగ్.. యస్ ఇప్పుడు క్యాబ్ సర్వీసులకు డైనమిక్ ప్రైసింగ్ అమలులోకి వచ్చింది.. ఓలా,ఉబర్, రాపిడో సర్వీసులు పీక్ అవర్స్ లో రెట్టింపు ఛార్జీలు వేసేందుకు కేంద్ర రవాణా శాఖ అనుమతినిచ్చింది. దీంతో క్యాబ్ వినియోగదారులకు రవాణా ఛార్జీలు మరింత పెరగనున్నాయి…ఇప్పటి వరకు విమానాలు,రైళ్ల కే పరిమితమైన డైనమిక్ ప్రైసింగ్ క్యాబ్ సర్వీసులకు అమలులోకి వచ్చింది..కనీస ధరకు అదనంగా రెండు రెట్లు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ఓలా , ఉబర్ , ర్యాపిడో క్యాబ్ సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది…ఈ నెల నుంచి ఇది అమలులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే

2025 మోటార్ వెహికల్ ఎగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను మార్చిన భారత ప్రభుత్వం నూతన రవాణా విధానం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో గరిష్ట సర్జ్ ప్రైసింగ్‌ మునుపటి 1.5 రెట్ల నుండి 2 రెట్లకు పెంచింది..ఇది పీక్ గంటల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు క్యాబ్ సంస్థలు డైనమిక్ ఫేర్ (రెట్టింపు ఛార్జ్) అమలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో కస్టమర్లకు వెంటనే క్యాబ్ అందించేందుకు ఇది సహాయపడుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ELI Scheme: కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి మోడీ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త.. కొత్త స్కీమ్‌!

డైనమిక్ ప్రైసింగ్ అంటే ఏమిటి?

డైనమిక్ ప్రైసింగ్ అంటే డిమాండ్ మరియు సరఫరా పరిస్థితులను బట్టి ధరలను మార్చే పద్ధతి. ఉదాహరణకు, రాత్రి సమయంలో టాక్సీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటే, ధరలు పెరుగుతాయి. ఇది డ్రైవర్లు వినియోగదారులకు అదనపు సేవలు అందించడానికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. ఈ మార్పు మధ్యతరగతి మరియు తక్కువ ఆదాయం గల వ్యక్తులకు భారం. ఎందుకంటే పీక్ గంటల్లో ధరలు ఎక్కువగా ఉంటాయి. సామాన్యులకు భారం తప్పదు.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 20వ విడత వచ్చేది అప్పుడే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి